Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఔను, స్పాట్‌ఫిక్సింగ్‌కు పాల్పడ్డా: ఒప్పుకున్న సల్మాన్

Posted by:
Published: Wednesday, June 17, 2015, 12:15 [IST]

లాహోర్: 2010లో ఇంగ్లాండుతో జరిగిన మ్యాచులో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సారథి సల్మాన్ భట్ అంగీకరించాడు. సల్మాన్ భట్ అధికారికంగా అంగీకరించాడని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తెలిపింది.

 Salman Butt confessed to spot-fixing, says PCB chief

ఈ మేరకు ఆయన వాంగ్మూలం పైన సంతకాలు చేశాడని చెప్పింది. 2010లో ఇంగ్లాండులోని లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్టులో తాను స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డానని, నోబాల్స్ వేశానని, ఫిక్సింగ్‌లో పాల్గొనాలని జట్టు మెంబర్స్ మహ్మద్ ఆసిఫ్, అమీర్‌లను కోరానని అంగీకరించాడు.

దేశవాళీ టోర్నీలలో ఆడాలన్న కోరికతోనే తాను తప్పు ఒప్పుకున్నట్లు సంతకాలు చేశానని సల్మాన్ భట్ తెలిపాడు. 2011లో స్పాట్ ఫిక్సింగ్ చేసిన ఆటగాళ్ల పైన ఐదేళ్ల నిషేధం విధించగా, అది ఈ సంవత్సరం సెప్టెంబరు 1వ తేదీతో ముగియనుంది.

English summary
Tainted former Pakistan captain Salman Butt has signed a confession note admitting to his role in the spot-fixing scandal during the Pakistan versus England series back in 2010, which led to a five-year ban.
మీ వ్యాఖ్య రాయండి