Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

పవార్‌దే విజయం, ఉపాధ్యక్షుడిగా వెంగ్‌సర్కార్

Posted by:
Updated: Friday, June 19, 2015, 13:42 [IST]

ముంబై: ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) ఎన్నికల్లో ఎన్‌సీపీ సుప్రీమో శరద్ పవార్ మరోసారి విజయం సాధించారు. బుధవారం (జూన్ 17)న జరిగిన పోలింగ్‌లో ప్రత్యర్ధి విజయ్ పాటిల్‌పై శరద్ పవార్ 27 ఓట్లతో విజయం సాధించి ఎంసీఏ అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికయ్యారు.

శరద్ పవార్‌కు 172 ఓట్లు రాగా విజయ్ పాటిల్‌కు 145 ఓట్లు వచ్చాయి. పవార్ వర్గానికే చెందిన మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్, ఆశిష్ షెలార్ ఉపాధ్యక్షులుగా, నితిన్ దలాల్ కోశాధికారిగా, పీవీ శెట్టి సంయుక్త కార్యదర్శులుగా గెలిచారు.

Sharad Pawar re-elected president, Dilip Vengsarkar vice-president

విజయ్ పాటిల్ ప్యానెల్‌కు చెందిన మరో మాజీ క్రికెటర్ ప్రవీణ్ ఆమ్రే ఒక్కడే, శరద్ పవార్ హవాను ఎదుర్కొని కార్య నిర్వాహక కమిటీ సభ్యుడిగా విజయం సాధించగలిగాడు.

Story first published:  Thursday, June 18, 2015, 12:09 [IST]
English summary
NCP supremo Sharad Pawar was re-elected as the President of Mumbai Cricket Association (MCA) after defeating Vijay Patil by a margin of 27 votes at the biennial elections held here on Wednesday (June 17).
మీ వ్యాఖ్య రాయండి