Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

'రికార్డ్' మిస్: తోశాడని ధోనీపై ఫైర్ (వీడియో)

Posted by:
Updated: Friday, June 19, 2015, 13:44 [IST]

ఢాకా: బంగ్లాదేశ్ - భారత్ మధ్య తొలి వన్డేలో ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను భారత సారథి మహేంద్ర సింగ్ ధోనీ తోసుకొని వెళ్లడంపై బంగ్లాదేశ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్‌లో తమ అసంతృప్తిని వెలిబుచ్చారు.

25వ ఓవర్లో ధోని వికెట్ల మధ్య పరుగెత్తుతున్న సమయంలో బంగ్లా కొత్త బౌలర్‌ ముస్తాఫిజర్‌ అడ్డంగా వచ్చాడు. అతడలా అడ్డుగా రావడం అదే మొదటిసారి కాదు. అంతకుముందు రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడూ ఇలాగే చేశాడు.

From Twitter: Bangladeshi fans angry with MS Dhoni for pushing bowling hero Mustafizur Rahman

ఐతే రోహిత్‌లా ధోని పక్కకు తప్పుకోలేదు. తన దారిలో తాను వేగంగా పరుగెత్తాడు. దీంతో అతడి భుజం ముస్తాఫిజర్‌కు గట్టిగా తాకింది. ఆ దెబ్బ ధాటికి అతడు కొద్దిసేపు మైదానం వీడాల్సి వచ్చింది.

కెరీర్‌లో తొలి వన్డే ఆడిన ముస్తాఫిజుర్ అరుదైన రికార్డును చేజార్చుకున్నాడు. 9.2 ఓవర్లలో అతను 5 వికెట్లు పడగొట్టాడు. తొలి వన్డేలోనే 5 వికెట్లు కూల్చిన 8వ బౌలర్‌గా రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించాడు. అయితే, మోహిత్ శర్మ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ని పట్టుకొని ఉండే, కెరీర్‌ను 6 వికెట్లతో మొదలుపెట్టిన బౌలర్‌గా ఫిడెల్ ఎడ్వర్డ్స్ సరసన అతనికి స్థానం లభించి ఉండేది.

జింబాబ్వేపై 2003 నవంబర్ 29న జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన ఎడ్వర్డ్స్ 22 పరుగులిచ్చి ఆరు వికెట్లు కూల్చాడు. ఆ రికార్డును సమం చేసే అవకాశాన్ని తానే స్వయంగా చేజార్చుకున్నా, టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌ను దారుణంగా దెబ్బతీసి, బంగ్లాదేశ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు ముస్తాఫిజుర్. ఆరంగేట్రంలోనే ఎక్కువ వికెట్లి తీసిన రెండో బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్.

Story first published:  Friday, June 19, 2015, 9:47 [IST]
English summary
From Twitter: Bangladeshi fans angry with MS Dhoni for pushing bowling hero Mustafizur Rahman
మీ వ్యాఖ్య రాయండి