Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ధోని రికార్డు: బంగ్లాపై ఓడిన అన్నిమ్యాచ్‌ల్లో ఆడాడు

Posted by:
Updated: Friday, June 19, 2015, 13:44 [IST]

ఢాకా: మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో ధోని సేనపై బంగ్లాదేశ్ 79 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్‌పై బంగ్లాదేశ్ గెలిచిన నాలుగు వన్డే మ్యాచ్‌లకు టీమిండియా వన్డే, ట్వంటీ20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సాక్ష్యంగా నిలిచాడు.

బంగ్లాదేశ్, భారత్‌ల మధ్య ఇప్పటి వరకు 30 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో టీమిండియా 25 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, బంగ్లాదేశ్ 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. భారత్‌పై బంగ్లాదేశ్ గెలిచిన నాలుగు మ్యాచ్‌ల్లో టీమిండియా ప్రస్తుత వన్డే కెప్టెన్ ధోని ఆడటం విశేషం.

1. భారత్, బంగ్లాదేశ్ చేతిలో తన తొలి వన్డే మ్యాచ్‌ను డిసెంబర్ 26, 2004లో బంగాబంధు జాతీయ స్టేడియంలో ఆడిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 230 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినా, 15 పరుగుల తేడాతో బంగ్లా చేతితో ఓడిపోయింది.

MS Dhoni's dubious record of featuring in all 4 matches that India have lost to Bangladesh

ఈ మ్యాచ్‌లో ధోని 8వ స్ధానంలో బ్యాటింగ్‌కు దిగి 16 బంతుల్లో కేవలం 12 పరుగులకే ప్రస్తుత బంగ్లా కెప్టెన్ మొర్తాజా ధోనిని పెవిలియన్‌కు పంపాడు. అయినా ఈ సిరిస్‌ను మాత్రం భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

2. ఐసీసీ వరల్డ్ కప్‌లో భాగంగా వెస్టిండిస్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవెల్‌లో రెండు జట్లు మార్చి 17, 2007న తలపడ్డాయి. రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్కోరు 191. ఈ మ్యాచ్‌లో ధోని డకౌట్ అయ్యాడు.

3. ఆసియా కప్‌లో భాగంగా బంగాబంధు జాతీయ స్టేడియంలో మార్చి 16, 2012న ఇరు జట్లు తలపడ్డాయి. ధోని నాయకత్వంలోని టీమిండియా 50 ఓవర్లకు గాను 289 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సెంచరీ చేయడం విశేషం.

ఈ మ్యాచ్‌లో ధోని 21 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో బంగ్లా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

4. చివరగా గురువారం జూన్ 18, 2015న మిర్‌పుర్‌లో షేర్ ఏ బంగ్లా జాతీయ స్డేడియంలో జరిగిన మ్యాచ్‌లో ధోని సేనపై బంగ్లాదేశ్ 79 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా తొలి వన్డేలో బంగ్లాదేశ్ ఇప్పటికే 1-0 ఆధిక్యంతో నిలిచింది.

మరోవైపు భారత్‌పై విజయం సాధించిన నాలుగు మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ కెప్టెన్ మొర్తాజా కూడా ఆడటం విశేషం. మొదటి రెండు మ్యాచ్‌ల్లో మొర్తాజా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నారు. భారత్, బంగ్లాదేశ్ కెప్టెన్లు ఇద్దరు కూడా 30 ఏళ్లకు పైబడినవారే. ఇరు జట్లలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు కూడా వీరే. 

Story first published:  Friday, June 19, 2015, 13:37 [IST]
English summary
India's one-day and Twenty20 captain Mahendra Singh Dhoni achieved a dubious distinction after India went down to Bangladesh by 79 runs in the first game of the three-match series here on Thursday.
మీ వ్యాఖ్య రాయండి