Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

కోహ్లీ వికెట్ కీపింగ్ ఆనందం, నెట్లో హల్‌చల్ (ఫోటో)

Posted by:
Published: Friday, June 19, 2015, 9:12 [IST]

ఢాకా: తొలి వన్డేలో భారత్‌కు బంగ్లా షాకిచ్చింది. 79 పరుగుల తేడాతో ధోనీ సేన పైన గెలిచింది. కాగా, ధోనీ నుంచి టెస్ట్ పగ్గాలను అందుకున్న కోహ్లీ ఈ వన్డే మ్యాచ్‌లో వికెట్ కీపింగ్ గ్లోవ్స్‌నూ అందుకున్నాడు.

 Photos and reactions from Twitter after Virat Kohli keeps wickets in ODI

43వ ఓవర్ ముగియగానే ధోనీ మైదానం విడిచి వెళ్లాడు. 44వ ఓవర్ ఉమేష్ యాదవ్ వేశాడు. ఈ ఓవర్లో కోహ్లీ కిపింగ్ చేశాడు. 45 ఓవర్ ఆరంభంలో ధోనీ తిరిగి వికెట్ కీపింగ్ బాధ్యతలను తీసుకున్నాడు.

44 ఓవర్లో విరాట్ కోహ్లీ వికెట్ కీపింగ్ తీసుకోవడం పైన అతని అభిమానులు ట్విట్టర్‌లో స్పందించారు. కీపింగ్ చేస్తున్న కోహ్లీ ఆనందంతో ఇలా కనిపించాడు. ఈ ఫోటో నెట్లో హల్ చల్ చేస్తోంది. కోహ్లీ బౌలర్, వికెట్ కీపర్, ఫీల్డర్ అంటూ ట్వీట్ చేశారు.

English summary
As Virat Kohli did something new on a cricket field at the Sher-e-Bangla Stadium during the first ODI against Bangladesh, his fans on social media took the opportunity to heap praise on India's Test captain.
మీ వ్యాఖ్య రాయండి