Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

రహానేపై ధోని వివరణ, 3-0తో ఓడినా విషయంకాదు

Posted by:
Published: Monday, June 22, 2015, 13:36 [IST]

మీర్పూర్: రెండో వన్డేలో అజింక్యా రహానేను తప్పించడం పైన మహేంద్ర సింగ్ ధోనీ పైన విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ధోనీ స్పందించాడు. క్విక్ పిచ్‌ల పైన రహానే బాగానే ఉన్నాడని, స్లో పిచ్‌ల పైన స్ట్రైక్‌ను రొటేట్ చేసేందుకు అతను ఇబ్బంది పడుతున్నాడని ధోనీ చెప్పాడు.

ముఖ్యంగా ఇంతకుముందు ఇన్నింగ్స్ చూడవచ్చునని చెప్పాడు. కాగా, గత పది వన్డే ఇన్నింగ్స్‌లలో రహానే రెండు అర్ధ సెంచరీలు చేశాడు. అందులో 79 అతని హయ్యెస్ట్ పరుగులు. ప్రపంచ కప్‌లో ఈ స్కోర్ అతను సౌతాఫ్రికా పైన చేశాడు.

రెండో వన్డేకు తుది జట్టులో ఏకంగా మూడు మార్పులు చేసి ధోని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఐతే ఆ మూడు మార్పుల్లో అనూహ్యమంటే రహానెపై వేటు వేయడమే. పేసర్లు ఎవరున్నా ఒక్కటే కాబట్టి తొలి వన్డేలో పేలవంగా బౌలింగ్‌ చేసిన ఉమేశ్‌ యాదవ్‌, మోహిత్‌ శర్మలను తప్పించడం అర్థం చేసుకోదగ్గదే.

Does not matter if we lose 3-0 to Bangladesh, says captain MS Dhoni

కానీ ప్రస్తుత జట్టులో అత్యంత నిలకడగా ఆడుతున్న బ్యాట్స్‌మెన్‌లో ఒకడైన రహానెపై వేటు వేయడం ఆశ్చర్యం కలిగించింది. ముందు తుది జట్టులో రహానె పేరు లేకపోవడం చూసి అతడికేమైనా గాయమైందేమోనని చాలామంది అనుకున్నారు. కానీ తప్పించారని తెలిసి ఆశ్చర్యపోయారు.

రహానె చాన్నాళ్లుగా అటు టెస్టుల్లో, ఇటు వన్డేల్లో నిలకడగా ఆడుతున్నాడు. బంగ్లాతో మొన్నటి టెస్టు మ్యాచ్‌లోనే చక్కటి ఇన్నింగ్స్‌ ఆడాడు. వన్డే తరహా వేగంతో 103 బంతుల్లోనే 98 పరుగులు చేశాడతను. మెరుపు షాట్లతో బంగ్లా బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు.

ఐతే తొలి వన్డేలో రహానె 9 పరుగులకే వెనుదిరిగాడు. నాసిర్‌ హుస్సేన్‌ పట్టిన ఓ అద్భుతమైన క్యాచ్‌కు అతను వెనుదిరగాల్సి వచ్చింది. ఒక్క మ్యాచ్‌లో విఫలమవగానే రహానెను తప్పించడం మింగుడుపడని విషయం. రహానె స్థానంలో వచ్చిన రాయుడు డకౌటై వెనుదిరిగాడు. ఆల్‌రౌండర్‌ పాత్రకు ఏనాడూ న్యాయం చేయని జడేజాపై విపరీతమైన నమ్మకం చూపించే ధోని.. రహానెను తప్పించడం ఆశ్చర్యపరిచింది.

3-0తో ఓడినా పెద్ద విషయం కాదు

ఇప్పటికే సిరీస్ కోల్పోయామని, ఇక మిగిలిన మ్యాచ్ ఓడిపోయినప్పటికీ అది పెద్ద విషయం కాదని ధోనీ చెప్పాడు. మూడో వన్డే తాము ఒత్తిడి లేకుండా ఆడతామని చెప్పాడు. 2-0తో భారత్ ఇప్పటికే సిరీస్‌ను బంగ్లాకు కోల్పోయింది. దీంతో తాము ఒత్తిడి లేకుండా ఆడతామని, 3-0తో ఓడినా పెద్ద విషయం కాదనడం గమనార్హం.

English summary
India captain MS Dhoni has said they want to play freely in the 3rd and final ODI against Bangladesh on Wednesday (June 24) since a scoreline of 3-0 does not matter as they have already lost the series.
మీ వ్యాఖ్య రాయండి