Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

రికార్డ్:ఎవరీ ముస్తాఫిజుర్, ఆకాశానికెత్తిన మీడియా

Posted by:
Published: Monday, June 22, 2015, 11:47 [IST]

మీర్పూర్: రెండు వన్డేల్లోను ముస్తాఫిజర్‌ రెహ్మాన్ భారత్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. తొలి వన్డేలో ఐదు వికెట్లు, రెండో వన్డేలో ఆరు వికెట్లు తీసి ఆరంగేట్రంలోనే సత్తా చాటాడు. వన్డేల్లో తొలి రెండు మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌ ముస్తాఫిజరే.

అంతే కాదు అరంగేట్రంలోనే వరుసగా రెండు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకుంది కూడా అతనే. జింబాబ్వే పేసర్‌ వెటోరీ తర్వాత తొలి రెండు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి బౌలర్‌గా రికార్డ్ సాధించాడు.

నాలుగేళ్ల క్రితం ఓ క్లబ్‌ తరఫున ఆడేందుకు తన స్వగ్రామం తెతులియా నుంచి ప్రతిరోజూ తన సోదరుడి స్కూటర్‌పై 40 కిలోమీటర్లు ప్రయాణించి సఖ్తిరా వెళ్లేవాడు. అండర్‌-19 జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆ తర్వాత 2014 అండర్‌-19 ప్రపంచ కప్‌కు బంగ్లా జట్టులో స్థానం సంపాదించాడు.

Mustafizur Rahman sets world record against India, Hails Bangladesh media

ఆ తర్వాత వెస్టిండీస్‌ పర్యటనకు బంగ్లా ఏ జట్టుకు ఎంపికయ్యాడు. తర్వాత పాకిస్థాన్‌తో టీ20 మ్యాచ్‌కు బంగ్లా జట్టుకు ఎంపికయ్యాడు. 20 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. సత్తాను గుర్తించిన సెలక్టర్లు భారత్‌తో సిరీస్‌కు ఎంపిక చేశారు.

నిన్నటి దాకా ముస్తాఫిజూర్ పేరు ఎవరికీ తెలియదు. ఇప్పుడు మాత్రం ముస్తాఫిజర్‌ సంచలనం. కానీ, రెండే రెండు వన్డేలతో బంగ్లా క్రికెట్‌పై తనదైన ముద్ర వేశాడు. భారత జట్టు తొలిసారి బంగ్లాకు వన్డే సిరీస్‌ కోల్పోవడానికి కారణమైన అతడిని భారత అభిమానులైతే ఎప్పటికీ మరిచిపోలేరు.

కాగా, బంగ్లాదేశ్ మీడియా తమ జట్టును సోమవారం నాడు ఆకాశానికెత్తింది. భారత్ పైన వరుసగా రెండో వన్డేలో గెలిచి ఇప్పటికే బంగ్లాదేశ్ సిరీస్ కైవసం చేసుకుంది. ముస్తాఫిజూర్ రెహ్మాన్ పైన పత్రికలో పొగడ్తల వర్షం కురిపించాయి.

ఇన్‌క్రెడిబుల్ అని, టైగర్స్ విన్ హిస్టోరిక్ వన్డే సిరీస్ అని, టైగర్స్ విన్ వన్డే సిరీస్ అని, ముస్తాఫిజ్ భారత్‌ను దెబ్బతీశాడని హెడ్డింగ్స్ పెట్టి బంగ్లాదేశ్ మీడియా వార్తలు రాసింది.

English summary
Bangladesh's newspapers today hailed their cricket team's historic ODI series win against India at Sher-e-Bangla Stadium.
మీ వ్యాఖ్య రాయండి