Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

‘డ్రెస్సింగ్ రూంలో విభేదాల వల్లే ధోనీపై ఒత్తిడి’

Published: Tuesday, June 23, 2015, 11:57 [IST]

రాంచీ: ఓటములు సాధారణమైనమే అయినప్పటికీ.. బంగ్లాదేశ్ వంటి ఓ చిన్న జట్టు చేతిలో రెండు భారీ పరాజయాలు చవిచూసి చరిత్రలో తొలిసారి ఆ జట్టుకు సిరీస్ కోల్పోవడం అంటే అందోళన కలిగించే విషయమే. అయితే ఈ వైఫల్యానికి సంచలన కారణాలను చెప్పాడు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాజీ వ్యక్తిగత కోచ్ చంచల్ భట్టాచార్యా.

డ్రెస్సింగ్ రూమ్‌లో నెలకొన్న విభేదాలు ధోనీ ప్రదర్శనపై ప్రభావం చూపుతున్నాయని, అంతిమంగా అవి ఫలితాన్ని నిర్దేశిస్తున్నాయన్నాడు. చూస్తుంటే టీమ్ ఇండియా డ్రెస్సింగ్ వాతావరణం ధోనీ కాంక్షినట్టుగా లేదనిపిస్తోందని చెప్పాడు.

 'Dhoni under pressure as environment of team dressing room is bad'

అక్కడ ఏం జరుగుతున్నదని చెప్పలేనుగానీ, ధోనీ ఏకాగ్రతను దెబ్బతీసే పరిస్థితులైతే ఉన్నాయని భట్టాచార్య పేర్కొన్నాడు. ధోనీ మానసికంగా ఒత్తిడికి గురవుతున్నాడని ఆయన చెప్పాడు. మీడియా కూడా అనవసర ఆరోపణలతో ధోనీ ఏకాగ్రతకు భంగం వాటిల్లేలా చేస్తోందని అన్నాడు.

‘బంగ్లాదేశ్ జట్టుతో టీమిండియా ఈ విధంగా ఆడటం ఇదే తొలిసారి. రెండు వన్డేల ఓటముల అనంతరం ధోనీ.. తనను జట్టులో సాధారణ ఆటగాడిలా ఆడమన్నా ఆడతానని అన్నాడు. కెప్టెన్ ఎవరు ఉన్నదానికంటే.. దేశానికి విజయాలే ముఖ్యమని ధోనీ తెలిపాడు' అని భట్టాచార్య గుర్తు చేశాడు.

English summary
India captain MS Dhoni is under pressure and unable to perform at his best as the current atmosphere in the dressing room is "bad", according to his former coach.
మీ వ్యాఖ్య రాయండి