Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

టెన్ స్పోర్ట్స్‌తో వివాదం: జింబాబ్వే పర్యటన రద్దు?

Posted by:
Published: Tuesday, June 23, 2015, 12:15 [IST]

ముంబై: వచ్చే నెలలో భారత జట్టు జింబాబ్వే పర్యటనను రద్దు చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జూలై 10వ తేదీన మొదలయ్యే పర్యటనలో జింబాబ్వేతో టీమిండియా మూడు వన్డేలు, రెండు టీట్వంటీలు ఆడాల్సి ఉంది.

అయితే, దీనిని ప్రసారం చేయనున్న టెన్ స్పోర్ట్స్‌తో నెలకొన్న వివాదాల కారణంగా ఈ సిరీస్‌ను రద్దు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. జింబాబ్వే క్రికెట్ చైర్మన్ విల్సన్ మనాసే వివాదం పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

India call off Zimbabwe tour due to broadcast and fatigue issues: Reports

అయితే, సమయం మరీ దగ్గర పడుతుండటంతో ప్రస్తుతానికి ఈ పర్యటనను రద్దు చేయాలని జింబాబ్వేకు బీసీసీఐ ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. అయితే, అవసరమైతే వచ్చే వచ్చే ఏడాదికి ఈ పర్యటనను వాయిదా వేయవచ్చునని జింబాబ్వే బోర్డు భావిస్తోంది.

English summary
Team India's forthcoming tour of Zimbabwe next month has been called off on Monday due to the unresolved issues between the BCCI and broadcaster Ten Sports.
మీ వ్యాఖ్య రాయండి