Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

శిఖర్ నా స్థానం చేజిక్కించుకున్నాడు: రాహుల్

Posted by:
Published: Wednesday, June 24, 2015, 11:53 [IST]

బెంగళూరు: శిఖర్ ధావన్‌తో తనకు ఆరోగ్యకరమైన పోటీ ఉందని టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ చెప్పాడు. టీమిండియాలో ఓపెనింగ్‌లో ఆరోగ్యకరమైన పోటీ ఉండటం మంచిదేనని ఆయన అభిప్రాయపడ్డాడు. ధావన్ గత రెండేళ్లుగా ఓపెనర్‌గా రాణిస్తున్నాడని చెప్పాడు.

ఆస్ట్రేలియా సిరీస్ సమయంలో అతని స్థానాన్ని తాను భర్తీ చేశానని చెప్పాడు. కాని మళ్లీ అతను ఆ స్థానాన్ని ఇప్పుడు చేజిక్కించుకున్నాడన్నాడు. ఇలా ఓపెనింగ్ కోసం పోటీ ఉండటం మంచి పరిణామమని చెప్పాడు. ఐపీఎల్లో ఒకే జట్టుకు ఆడటం వల్ల తమ ఇద్దరి మధ్య మంచి సంబంధం ఏర్పడిందని చెప్పాడు.

శిఖర్ ధావన్ తనకు విలువైన సూచనలు ఇచ్చేవాడని చెప్పాడు. త్వరలో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్ తమకు ఓ సవాల్ అన్నాడు. ఫిట్‌నెస్ పైన తాము దృష్టి సారించామనని చెప్పాడు. కేవలం టెస్టు మ్యాచులే కాకుండా వన్డేల్లోను రాణించాలనేది తన కోరిక అని చెప్పాడు.

 Competition for opening slot good for India - Rahul

అతని స్థానాన్ని తాను ఆక్రమించానని, అతను మళ్లీ ఆక్రమించాడని, తమ మధ్య ఆరోగ్యకరమైన పోటీ అని, ఇది మంచి పరిణామమని చెప్పాడు. శిఖర్ ధావన్ అన్ని ఫార్మాట్లలోను బాగా ఆడుతున్నాడని చెప్పాడు. తామిద్దరం ఒకే ఐపీఎల్ టీంకు చెందిన వారమని, దీంతో తమ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పాడు.

తాను ఓ మ్యాచ్ ఆడుతున్న సమయంలో మరీ ఒత్తిడిని పెంచుకోనని చెప్పాడు. దేశీయ వన్డే క్రికెట్లో తాను మొదటి ఏడాది బాగా ఆడానని చెప్పాడు. అత్యధిక పరుగులు చేసిన తొలి ముగ్గురిలో తాను ఉన్నానని చెప్పాడు.
వన్డే ఆడేందుకు తాను ఉత్సుకత చూపిస్తానని చెప్పాడు.

తాను యువకుడినని, కొత్తగా అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశించానని, తాను అక్కడ నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని చెప్పాడు.

నేను టెస్టు క్రికెట్లో, వన్డే క్రికెట్లో రాణిస్తానని విశ్వాసం వ్యక్తం చేస్తున్నానని చెప్పాడు. బెస్ట్ ప్లేయర్‌గా ఎదిగేందుకు.. మనకు మనం మోటివేట్ చేసుకోవాలని, వచ్చే సీజన్ గురించి ఆలోచించాలని, ఎక్కువ పరుగులు చేయాలని అన్నాడు.

English summary
Shikhar Dhawan may have grabbed the opportunity in his absence during the one-off cricket Test against Bangladesh with both hands but KL Rahul will tell you that he shares a "good relationship" with the Delhi lad and the competition for opening slot is good for the team.
మీ వ్యాఖ్య రాయండి