Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ధోనీ అడిగితే.. నా ప్రాణం ఇస్తా: అశ్విన్

Published: Wednesday, June 24, 2015, 11:51 [IST]

మిర్పూర్: భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పట్ల స్వామి భక్తిని చాటుకున్నాడు. జట్టు సభ్యులందరూ ధోనీకి మద్దతుగానే ఉన్నారని చెప్పాడు. అంతేగాక, ఒకవేళ ధోనీ.. తనను చావమంటే మైదానంలోనే ప్రాణాలు విడుస్తానని చెప్పాడు అశ్విన్.

బంగ్లాదేశ్ జట్టుతో తొలిసారి సిరీస్ ఓటమి అనంతరం డ్రెస్సింగ్ రూంలో ఎలాంటి భిన్న వాతావరణం లేదని చెప్పాడు. మూడు మ్యాచుల వన్డే సిరీస్‌ను వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి బంగ్లాదేశ్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ధోనీపై పలు వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అశ్విన్ స్పందించాడు.

‘ఇప్పుడు మేము మా నాయకుడికి(ధోనీ) మద్దతుగా లేకపోతే.. మేము కూడా మీలాగే మారిపోయినట్లు. మేమంతా ఒక సైన్యం.. నాయకుడు చెప్పినట్లుగానే మేం నడుచుకుంటాం. ఒకవేళ మా కెప్టెన్ మైదానంలో చనిపోమంటే.. అందుకు నేను సిద్ధమే' అని అశ్విన్ పేర్కొన్నాడు.

If MS Dhoni asks me to die on field, I'll do it: Ravichandran Ashwin

ఇప్పుడే కాదు, ఏవరు కెప్టెన్‌గా ఉన్నా.. మేమంతా అతని వెనకాలే ఉంటామని చెప్పాడు. అతడు ప్రాణాలు అడిగితే.. అందుకు మేం సిద్ధమవుతామని తెలిపాడు. భారత క్రికెట్‌లో ధోనీ ఒక దిగ్గజమని, అతడు దేశానికి ఎంతో చేశాడని చెప్పాడు. అతను చేసి మనం మర్చిపోకూడదని తెలిపాడు.

‘మొత్తం జట్టు ప్రదర్శనకు అతడ్ని ఒక్కడ్నే బాధ్యుడ్ని చేయకూడదు. అది మంచిది కాదు. మేమంతా సమష్టిగా విఫలమయ్యాం. మేమంతా సమష్టిగానే రాణిస్తాం. ఓటములతో ఓ సీజన్ ముగిస్తే అంతా చెడ్డది అయిపోదు. చేయాల్సింది చేస్తాం' అని చెప్పాడు.

‘బంగ్లాతో వన్డే సిరీస్‌లో వాస్తవంగా మేం బాగా ఆడలేకపోయాం. అయితే డ్రెస్సింగ్ రూంలో భిన్నమైన వాతావరణం లేదు. అంతా బాగానే ఉంది. మేం కొన్ని కోల్పోయాం.. చాలా గెలస్తాం' అని అశ్విన్ తెలిపాడు. మూడో వన్డేలో స్వేచ్ఛగా, సానుకూల దృక్పథంతో ఆడతామని చెప్పాడు.

English summary
India off-spinner Ravichandran Ashwin has said that the team is standing strongly behind beleaguered skipper Mahendra Singh Dhoni and there is no change in the dressing room atmosphere despite the visitors losing their first-ever ODI series to Bangladesh.
మీ వ్యాఖ్య రాయండి