Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఐసీసీ ప్రెసిడెంట్‌గా పాక్ మాజీ కెప్టెన్ జహీర్ అబ్బాస్

Posted by:
Published: Thursday, June 25, 2015, 11:31 [IST]

బ్రిడ్జిటౌన్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రెసిడెంట్‌గా పాకిస్ధాన్ మాజీ కెప్టెన్ జహీర్ అబ్బాస్ నియమితులయ్యారు. బార్బడోస్‌లో జరిగిన ఐసీసీ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ఐసీసీ గవర్నింగ్ బాడీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఐసీసీ ప్రెసిడెంట్ పదవిలో జహీర్ అబ్బాస్ జూన్ 24 నుంచి ఏడాది పాటు కొనసాగుతారు. ఐసీసీ ప్రెసిడెంట్‌గా తన అభ్యర్ధిత్వాన్ని ధృవీకరించినందుకు జహీర్ అబ్బాస్ ఐసీసీ బోర్డుకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ ఏడాది మార్చి 29న జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ట్రోఫీ బహుకరించేందుకు గాను తనని ఆహ్వానించలేదని వివాదం సృష్టించిన ముస్తపా కమల్ స్ధానంలో జహీర్ అబ్బాస్ నియమితులయ్యారు.

Former Pakistan captain Zaheer Abbas is the new President of ICC

ఈ సందర్భంలో జహీర్ అబ్బాస్ మాట్లాడుతూ ఐసీసీ గవర్నింగ్ బాడీ తనని ప్రెసిడెంట్‌గా ఎన్నుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశాడు. జహీర్ అబ్బాస్ నియామకం పట్ల ఐసీసీ ఛైర్మన్ ఎన్ శ్రీనివాసన్ మాట్లాడుతూ జహీర్ అబ్బాస్ ఐకానిక్ క్రికెటర్, గేమ్‌లో ఎల్లప్పుడూ నైపుణ్యం, ఫ్లెయిర్‌తో పోషించిన ఒక దిగ్గజ క్రికెటర్ అంటూ కొనియాడారు.

మా గొప్ప ఆట యొక్క ఒక విలువైన రాయబారి అంటూ సంబోధించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 7,500కు పైగా పరుగులు, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతడు నెలకొల్పిన 108 సెంచరీలు అతడి అసాధారణ కెరీర్ కు ప్రతిబింబంగా నిలుస్తాయని తెలిపారు.

జహీర్ అబ్బాస్ పాకిస్ధాన్ జట్టు తరుపున 1975, 1979, 1983 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లలో ఆడారు. 14 టెస్టులు, 13 వన్డేలకు కెప్టెన్‌గా జట్టుకు నాయకత్వం వహించాడు. 34,843 పరుగులతో ఆసియాలో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 108 సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు ఒక్క జహీర్ అబ్బాసే.

1993లో శ్రీలంక, వెస్టిండిస్ జట్ల మధ్య శ్రీలంకలో జరిగిన సిరిస్‌కు మ్యాచ్ రిఫరీగా కూడా పని చేశారు. బార్బడోస్‌లో జరిగిన ఐసీసీ వార్షిక సర్వ సభ్య సమావేశంలో 58వ దేశంగా సెర్బియా క్రికెట్ అసోసియేషన్‌కు గవర్నింగ్ బాడీ అనుమతిచ్చింది.

English summary
Former Pakistan captain Zaheer Abbas has been confirmed as the new President of the International Cricket Council (ICC) on the third day of the ICC Annual Conference week in Barbados, the game's world governing body announced.
మీ వ్యాఖ్య రాయండి