Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ముస్తాఫిజుర్ వెనుక భారతీయుడు! ఐపీఎల్‌పై కన్ను

Posted by:
Published: Thursday, June 25, 2015, 12:08 [IST]

మీర్పూర్: భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మూడు వన్డేల్లో మొత్తం 13 వికెట్లు తీసి రికార్డ్ సృష్టించాడు. ఆరంగేట్రంతోనే ఈ పందొమ్మిదేళ్ల లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అందరి దృష్టిని ఆకర్షించాడు.

ప్రత్యర్థులను బెంబేలెత్తించే వేగం, టెక్నిక్‌కు కచ్చితత్వం జోడించి తొలి వన్డేలో 5, రెండో వన్డేలో 6, మూడో వన్డేలో 2 వికెట్లు తీశాడు. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్ జట్టుపై ముస్తాఫిజుర్ ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. అయితే, ముస్తాఫిజుర్ వెనుక ఓ భారతీయ బౌలర్ హస్తం ఉంది.

అతడి పేరు రణదేవ్ బోస్. రణదేవ్ బోస్ బంగ్లాదేశ్ నేషనల్ క్రికెట్ అకాడమీలో బౌలింగ్ కోచ్‌గా సేవలు అందించాడు. యువ ఫాస్ట్ బౌలర్లను గుర్తించి వారికి సానబెట్టాడు.

 Mustafizur's Rise: The Indian Connection, Eyeing IPL Contract

నాడు 17 ఏళ్ల ముస్తాఫిజూర్ బలహీనంగా కనిపించాడు. గ్రామీణ, పేద కుటుంబం నుంచి వచ్చాడు. రెండు నెలల్లో కోచ్‌ను ముస్తాఫిజుర్ మెప్పించాడు. దీంతో అతనికి మంచి శిక్షణ ఇచ్చాడు. ముస్తాఫిజుర్‌కు బౌలింగ్ కిటుకులు నేర్పాడు.

ముస్తాఫిజుర్ ప్రదర్శనపై మాట్లాడుతూ.. అతడికి మంచి భవిష్యత్తు ఉందని, ఇంటర్నెషనల్ క్రికెట్‌కు ఇలాగే ఆడితే మరింత రాటుదేలుతాడని చెప్పాడు. అతడు తన ప్రదర్శనతో తనను ఆకట్టుకునే వాడని చెప్పాడు. మరోవైపు, ముస్తాఫిజుర్ ఐపీఎల్ కాంట్రాక్ట్ పైన కన్నేశాడని తెలుస్తోంది. వచ్చే లీగ్‌లో అతనిని ఫ్రాంచైజీలు కొనుక్కునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

English summary
Rehman picked up 11 wickets in his first two ODIs to script Bangladesh's first ever bilateral series win over two-time world champions India.
మీ వ్యాఖ్య రాయండి