Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

'ఫీల్డ్‌లో ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధం': అశ్విన్ వివరణ

Posted by:
Published: Friday, June 26, 2015, 16:47 [IST]

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ మైదానంలో తన ప్రాణాలు కోరితే ఇచ్చేస్తానని, అందుకు ఎవరైనా సిద్ధంగా ఉండాలని టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాడు. నేను చేసిన వ్యాఖ్యలు కొంత మంది తప్పుగా అర్ధం చేసుకున్నారని, సంబంధం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.

బంగ్లా పర్యటనలో భాగంగా రెండో వన్డే ఓటమి తర్వాత అశ్విన్ మంగళవారం (జూన్ 23) నాడు మీడియాతో మాట్లాడుతూ జట్టు సభ్యులంతా ధోని వెంట ఉన్నారు. మైదానంలో కెప్టెన్ తన ప్రాణాలు కోరితే ఇచ్చేస్తానని, అందుకు ఎవరైనా సిద్ధంగా ఉండాలని అశ్విన్ కోరాడు.

Ashwin clarifies his 'die on the field' comment, asks 'not to assume and mislead'

ధోని భారత్ క్రికెట్ దిగ్గజాల్లో ఒకడని, దేశం కోసం ఎంతో చేశాడని చెప్పారు. క్లిష్ట పరిస్ధితుల్లో కెప్టెన్‌కు మద్దతుగా నిలవకపోతే ఖచ్చితంగా పర్యవసానం చూడాల్సి వస్తుందని అన్న విషయం తెలిసిందే. తాను చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం అశ్విన్ ట్విట్టర్‌లో వివరణ ఇచ్చాడు.

తాను చేసిన వ్యాఖ్యలు ధోనిని ఉద్దేశించినవి కావని, టీమిండియా కెప్టెన్ స్ధానంలో వారికి తన మద్దతు ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. దీనిని తప్పుగా భావించవద్దంటూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.

English summary
Indian offspinner R Ashwin has clarified his statement of ready "to die on the field" for captain MS Dhoni. He said his comments were misinterpreted and felt some of them were "blowing things way out of proportion".
మీ వ్యాఖ్య రాయండి