Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

డ్రెస్సింగ్ రూంలో విభేదాలు లేవు: గంగూలీ

Published: Friday, June 26, 2015, 11:42 [IST]

కోల్‌కతా: టీమిండియా డ్రెస్సింగ్‌రూంలో విభేదాలు పొడచూపినట్లు వస్తున్న కథనాలను మాజీ కెప్టెన్‌, బిసిసిఐ సలహామండలి సభ్యుడు సౌరభ్‌ గంగూలీ కొట్టిపారేశాడు. భారత్‌ ఎప్పుడు ఓడినా ఇలాంటి కథనాలు వస్తుంటాయని అన్నాడు.

తనకుకు తెలిసి భారత డ్రెస్సింగ్‌రూమ్‌లో అంతా సవ్యంగానే ఉందని గంగూలీ పేర్కొన్నాడు. ధోనీకి, కోహ్లీకి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందన్న వార్తలన్నీ ఊహాగానాలేనని చెప్పాడు. అయితే బంగ్లాదేశ్‌ చేతిలో సిరీస్‌ ఓటమి నిరాశ కలిగించిందని అన్నాడు. బంగ్లాదేశ్ మెరుగైన క్రికెట్‌ ఆడిందని చెప్పాడు.

కెప్టెన్ ధోనీ నాలుగో స్థానంలో రావడం సరైన నిర్ణయమని గంగూలీ అభిప్రాయపడ్డాడు. 'ధోని నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడం టీమ్‌ఇండియాకు శుభవార్త. దీంతో అతడు ఎక్కువసేపు బ్యాటింగ్‌ చేయగలుగుతాడు. అతడు నాలుగో స్థానంతో ఎంతకాలం బ్యాటింగ్‌ చేస్తాడో చూద్దాం' అని గంగూలీ పేర్కొన్నాడు.

No rift in Indian dressing room, says Sourav Ganguly

ఐసిసి ర్యాంకింగ్స్: టాప్‌-10లో అశ్విన్‌

దుబాయ్‌: భారత్‌ ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఐసిసి బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లోకి దూసుకెళ్లాడు. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో రాణించిన అశ్విన్‌.. రెండు స్థానాలు ఎగబాకి పదో స్థానానికి చేరాడు. భారత్‌ నుంచి అశ్విన్‌ కాకుండా షమి (12) మాత్రమే టాప్‌-20లో ఉన్నాడు.

మిచెల్‌ స్టార్క్‌ అగ్రస్థానంలో నిలిచాడు. బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ నాలుగో ర్యాంకు సాధించాడు. ధావన్‌ ఒక ర్యాంకును కోల్పోయి ఏడో స్థానానికి చేరుకున్నాడు. ధోని ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. డివిలియర్స్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా, బంగ్లాదేశ్‌ టీమ్‌ ర్యాంకింగ్స్‌లో ఎనిమిది నుంచి ఏడో ర్యాంకుకు ఎగబాకింది.

English summary
Dismissing reports of a rift in the Indian dressing room after their first-ever ODI series loss to Bangladesh, former India cricket captain Sourav Ganguly today said such talk is normal when a team loses.
మీ వ్యాఖ్య రాయండి