Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ధోనీని అనడం అంటే: కిర్మాణీ అండ, గవాస్కర్ ప్రశంస

Posted by:
Published: Friday, June 26, 2015, 12:00 [IST]

బెంగళూరు: మహేంద్ర సింగ్ ధోనీకి ఆటగాళ్లతో పాటు సీనియర్ల నుండి మంచి మద్దతు లభిస్తోంది. సయ్యద్ కిర్మాణీ, సునీల్ గవాస్కర్ తదితరులు మద్దతు పలికారు. రైనా, అశ్విన్ వంటి వాళ్లు ఇప్పటికే ధోనీకి అండగా నిలిచారు.

సయ్యద్ కిర్మాణీ వన్ ఇండియాతో మాట్లాడుతూ.. భారత క్రికెట్ జట్టును మూడు ఫార్మాట్లలోని ధోనీ ఎత్తుకు తీసుకు వెళ్లాడని చెప్పాడు. కేవలం ఒక్క సిరీస్ ఓడిపోయినంత మాత్రాన అతనిని తప్పించాలనేవాళ్లది పెట్టీ మైండ్ అని ఎద్దేవా చేశారు.

బంగ్లాదేశ్‌తో సిరీస్ కోల్పోయినందుకు కొందరు ధోనీని ప్రశ్నించడం దురదృష్టకరమన్నాడు. ఇది క్రికెట్ అని, కొన్నిసార్లు గెలుస్తాం, మరికొన్నిసార్లు ఓడుతామన్నాడు. ఎప్పుడు ఎవరు కూడా అన్నిసార్లు గెలుపొందలేరని చెప్పాడు. బంగ్లాదేశ్ బాగా ఆడిందన్నాడు.

సంక్షోభంలో ఉన్న సమయంలో ధోనీ భారత క్రికెట్‌ను ముందుకు తీసుకు వెళ్లాడన్నాడు. ధోనీ అందరికంటే స్థిరమైన బ్యాట్సుమెన్ అన్నాడు.

People questioning MS Dhoni are 'petty-minded', says Syed Kirmani

గవాస్కర్ ప్రశంసలు

బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో చక్కని ఇన్నింగ్స్‌ ఆడిన ధోనిపై గావస్కర్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ఐతే అవసరమైనప్పుడే అతడు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు రావాలని చెప్పాడు. ధోని బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఎక్కడ వచ్చినా పరుగులు చేయగలడని, తనపై జట్టు ఆధారపడి ఉందని, బ్యాటింగ్‌లో దానికి దారి చూపాల్సిన అవసరముందని అతడు గ్రహించాడని చెప్పాడు.

ఎందుకంటే పెద్ద ఆటగాళ్లున్నప్పటికీ టాప్‌ ఆర్డర్‌ సరిగా రాణించట్లేదని, ధావన్‌ను మినహాయిస్తే అక్కడ నిలకడ లేదని, కోహ్లీ ఇలా విఫలం కావడం చాలా అరుదు అన్నాడు. అందుకే ధోని ముందు బ్యాటింగ్‌కు వచ్చాడన్నాడు. సహచరులకు మార్గాన్ని చూపించాడని, జట్టుకు ఊపు తెచ్చాడన్నాడు. ఈ కారణంగా రైనా స్వేచ్ఛాయుతంగా బ్యాటింగ్ చేయగలిగాడన్నారు.

ఐతే ధోని ఎప్పుడూ నాలుగో స్థానంలో రావాల్సిన అవసరం లేదని, అది రహానే స్థానమన్నాడు. పరిస్థితిని బట్టి అతడు నాలుగు లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగొచ్చన్నాడు. ఓపెనర్లు అద్భుత ఆరంభాన్నిస్తే ప్రత్యర్థిపై ఒత్తిడిని కొనసాగించేందుకు మూడో స్థానంలో కూడా రావొచ్చన్నాడు. కానీ అతడు నాలుగో స్థానంలో స్థిరపడరాదని చెప్పాడు.

రహానేనే నాలుగో నెంబర్ ఆటగాడని, ఎందుకంటే సరిగా స్త్ట్రెక్‌ రొటేట్‌ చేయడని అంటున్నప్పటికీ రహానె అనేక రకాల షాట్లు ఆడగలడడని, త్వరగా వికెట్లు పడితే, వికెట్ల పతనాన్ని ఆపి ఇన్నింగ్స్‌ను కుదుటపడిచే టెక్నిక్‌ అతడికి ఉందన్నాడు. బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ధోని మరింత చొరవ తీసుకోవాలని సూచించాడు. ప్రతి ఆటగాడూ కెప్టెన్‌ తనకు అండగా ఉండాలని కోరుకుంటాడన్నాడు.

టాప్‌-10లో అశ్విన్‌

ఆఫ్ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి దూసుకెళ్లాడు. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో రాణించిన అశ్విన్‌ రెండు స్థానాలు ఎగబాకి పదో స్థానానికి చేరాడు. భారత్‌ నుంచి అశ్విన్‌ కాకుండా షమి (12) మాత్రమే టాప్‌-20లో ఉన్నాడు.

మిచెల్‌ స్టార్క్‌ అగ్రస్థానంలో నిలిచాడు. బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో కోహ్లి నాలుగో ర్యాంకు సాధించాడు. శిఖర్ ధావన్‌ ఒక ర్యాంకును కోల్పోయి ఏడో స్థానానికి చేరుకున్నాడు. ధోని ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. డివిలియర్స్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్‌ టీమ్‌ ర్యాంకింగ్స్‌లో ఎనిమిది నుంచి ఏడో ర్యాంకుకు ఎగబాకింది.

English summary
Speaking exclusively to OneIndia, Kirmani praised Dhoni for having brought glory to India in all 3 formats of the game. He said those asking for his removal are "petty-minded".
మీ వ్యాఖ్య రాయండి