Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

వన్డే క్రికెట్‌లో కొత్త రూల్స్: జులై 5 నుంచి అమల్లోకి

Posted by:
Published: Saturday, June 27, 2015, 10:16 [IST]

బ్రిడ్జిటౌన్: వన్డే క్రికెట్‌లో నిబంధనలు మార్చాలని గత కొంతకాలంగా వస్తున్న డిమాండ్లకు అనుగుణంగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఆ దిశగా అడుగులు వేసి, కొన్ని నిబంధనలను మార్చింది. మార్చిన నిబంధనలు జులై 5, 2015 నుంచి అమల్లోకి రానున్నాయి.

బార్బడోస్‌లో (జూన్ 26)న జరిగిన సమావేశంలో మార్చిన నిబంధనలకు ఐసీసీ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ఆమోద ముద్ర వేశారు. టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే సారధ్యంలో వన్డే క్రికెట్ నిబంధనలను మార్చాలంటూ ఒక నివేదికను ఐసీసీ క్రికెట్ కమిటీకి అందజేశారు.

చివరి పది ఓవర్లలో ఒకప్పట్లాగే 30 గజాల వలయం అవతల ఐదుగురు ఫీల్డర్లను అనుమతించేలా నిబంధనల్ని సవరించింది. వలయం అవతల నలుగురు ఫీల్డర్లనే అనుమతిస్తుండటం స్లాగ్‌ ఓవర్లలో బౌలర్లకు శాపంగా మారుతున్న సంగతి తెలిసిందే.

New ODI rules from July 5; Here are the 4 changes

తొలి పది ఓవర్లలో ఇద్దరు ఫీల్డర్లు క్యాచింగ్‌ స్థానాల్లో ఉండాలన్న నిబంధనను కూడా ఐసీసీ రద్దు చేసింది. ఐతే తొలి పవర్‌ప్లే విషయంలో ఎలాంటి మార్పు లేదు. ఈ పది ఓవర్లలో వలయం అవతల ఇద్దరు ఫీల్డర్లే ఉండాలన్న నిబంధన కొనసాగుతుంది.

11-40 ఓవర్ల మధ్య మాత్రం వలయం అవతల నలుగురు ఫీల్డర్లుంటారు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఓ కీలక మార్పు కూడా చేసింది. ప్రస్తుతం క్రీజు నోబాల్‌కు మాత్రమే ఫ్రీహిట్‌ ఇస్తుండగా.. ఇకపై దాంతో పాటు బ్యాట్స్‌మెన్‌కు వేసే నోబాల్‌కు కూడా ఫ్రీహిట్‌ అవకాశముంటుంది. ఈ నిబంధన టీ20లకు కూడా వర్తిస్తుంది.

వన్డే క్రికెట్‌లో కొత్త నిబంధనలు:

* 15-40 ఓవర్ల మధ్య బ్యాటింగ్ పవర్ ప్లే ఉండదు

* చివరి పది ఓవర్లలో 30 గజాల వలయం అవతల ఐదుగురు ఫీల్డర్లకు అనుమతి

* క్రీజు నోబాల్‌కు మాత్రమే ఫ్రీహిట్‌ ఇస్తుండగా.. ఇకపై బ్యాట్స్‌మెన్‌కు వేసే నోబాల్‌కు ఫ్రీహిట్‌

English summary
The International Cricket Council's (ICC) Board has approved changes to the ODI playing conditions and will come into effect from July 5, 2015.
మీ వ్యాఖ్య రాయండి