Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఫిక్సింగ్‌లో రైనా, జడెజా, బ్రావో: బాంబు పేల్చిన లలిత్

Posted by:
Published: Sunday, June 28, 2015, 10:19 [IST]

న్యూఢిల్లీ: రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపిన లలిత్ మోడీ మరో బాంబు పేల్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు జడెజా, బ్రావో, రైనాలకు ఐపీఎల్ బెట్టింగ్ కుంభకోణంతో సంబంధం ఉందని ఆరోపించాడు. బుకీ బాబా దివాన్‌తో వారి సంబంధాలపై ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్ సన్‌కు 2013లో రాసిన లేఖను గురించి మోడీ ట్వీట్ చేశాడు.

ఆ విషయాలన్నింటినీ ప్రస్తావిస్తూ రాసిన లేఖను శ్యామ్ స్వామి అనే అపరిచత వ్యక్తి ట్విట్టర్లో ఉంచాడు. అయితే, ఆ లేఖ డేవ్‌కు రాసినట్లుగా తెలుస్తోన్నప్పటికీ... లలిత్ ఈ మెయిల్ అడ్రస్ ఉండాల్సిన చోట మాత్రం నల్లరంగు ఉంది.

ఆ లేఖలో ఉన్న వివరాల ప్రకారం.. ఆ ముగ్గురు ఆటగాళ్లలో బ్రావో రూ.20 కోట్ల నగదును, మిగతా ఇద్దరికి చెరి రూ.20 కోట్ల ఖరీదు చేసే ప్లాట్లను దివాన్ బహూకరించాడట. రైనాకు ఢిల్లీలోని వసంత విహార్, నోయిడాలలో, జడెజాకు ముంబైలోని బాంద్రా ప్రాంతంలో సముద్రం ఒడ్డున ఈ ప్లాటును ఇచ్చినట్లు లేఖలో రాశాడు.

IPL: Raina, Jadeja, Bravo were involved in bribing, alleges Lalit Modi

ఇంకా ఈ బుకీ దివాన్.. మేయప్పన్, రాజ్ కుంద్రాలకు మంచి స్నేహితుడని ఆ లేఖలో ప్రస్తావించాడు. దివాన్ ఒక్కో మ్యాచుకు సుమారు 60 నుంచి 120 కోట్ల దాకా బెట్టింగ్ నిర్వహిస్తుంటాడని తనకు సమాచారం ఉందన్నాడు.

ఇదిలా ఉండగా.. ఐపీఎల్ 8 సమయంలో ముంబైకి చెందిన రాజస్థాన్ ఆటగాడు ఒకరు... ఫిక్సింగ్‌కు సహకరించాలని బూకీలు తనను కలిశారని బీసీసీఐకి చెప్పినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ వివరాలు బయటకు రాలేదు. అయితే, ఫిక్సర్ సంప్రదించిన ఆటగాడు ప్రవీణ్ తంబే కావొచ్చని వార్తలు వస్తున్నాయి.

English summary
Controversial former IPL Commissioner Lalit Modi has now alleged that two leading Indian cricketers and a West Indian player had been bribed by an Indian real estate tycoon, who is also a bookmaker.
మీ వ్యాఖ్య రాయండి