Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

‘మీడియా సృష్టే.. ధోనీ-కోహ్లీ మధ్య విభేదాల్లేవు’

Published: Monday, June 29, 2015, 19:20 [IST]

న్యూఢిల్లీ: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీల మధ్య ఎటువంటి విభేదాలు చోటు చేసుకోలేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా మహేంద్ర సింగ్ ఫీల్డింగ్ నిర్ణయాలపై కోహ్లీ విభేదించాడని వచ్చిన వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని తెలిపింది.

అది కేవలం మీడియా సృష్టి మాత్రమేనని సోమవారం సెలెక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్ పేర్కొన్నారు. ప్రస్తుతం టీమిండియా జట్టులో ఎటువంటి విభేదాలు లేవని సందీప్ తెలిపారు. బంగ్లాదేశ్ టూర్‌లో ఇద్దరు ఆల్ రౌండర్లు ఉండాలన్న కారణంగానే విక్రమ్ రాథోడ్, రోజర్ బిన్నీలను ఎంపిక చేశామన్నారు.

BCCI says no rift between Kohli and Dhoni

టీమిండియా ఓటమి తరువాత చాలా రకాలైన వ్యాఖ్యలు విన్నామని.. అయితే ధోనీ కెప్టెన్సీపై మాత్రం ఇప్పటివరకూ ఎటువంటి చర్చ జరగలేదన్నాడు. బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా ధోనీ నిర్ణయాలను కోహ్లీ వ్యతిరేకించాడన్న కథనాలు అవాస్తవమని చెప్పారు. అదంతా మీడియా సృష్టేనని చెప్పారు. భారత జట్టులోనూ ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.

ఇది ఇలా ఉండగా, బిసిసిఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. కొత్త నియమించే విషయాన్ని మాజీ కెప్టెన్లు సచిన్ టెండూల్కర్, సచిన్ టెండూల్కర్, బ్యాటింగ్ దిగ్గజం వివిఎస్ లక్ష్మణ్‌లతో కొత్తగా నియామకమైన అడ్వైజరీ ప్యానెల్ చూసుకుంటుందని చెప్పారు.

English summary
Dismissing media speculation, the Indian cricket board denied that there is any rift in the team between Test skipper Virat Kohli and limited overs captain Mahendra Singh Dhoni.
మీ వ్యాఖ్య రాయండి