Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

సీపీఎల్: గేల్ విధ్వంసం, 10 వికెట్ల తేడాతో గెలుపు

Posted by:
Published: Monday, June 29, 2015, 12:00 [IST]

సెయింట్ లూసికా: వెస్టిండిస్‌లో జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ విధ్వంసం సృష్టించాడు. ఈ లీగ్‌లో క్రిస్ గేల్ జమైకా తల్లవాస్ అనే జట్టుకు కెప్టెన్‌గా వ్వవహారిస్తున్నాడు.

ఆదివారం (జూన్ 28)న సెయింట్ లూసికా జోక్స్ జట్టుపై జరిగిన మ్యాచ్‌లో 9 సిక్సులు, 6 ఫోర్లతో చితకొట్టి తన జట్టుకు 10 వికెట్ల తేడాతో విజయం సాధించి పెట్టాడు. ఇంతకీ ఈ లీగ్‌లో తన ప్రత్యర్ధి జట్టుకు కెప్టెన్ ఎవరో తెలుసా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్.

CPL: Chris Gayle smashes 9 sixes as Jamaica win by 10 wickets

బీసాజూర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్ విధ్వంసం ముందు కెవిన్ పీటర్సన్ బౌలర్లు నిలవలేకపోయారు. ఈ మ్యాచ్‌లో కెవిన్ పీటర్సన్ 25 బంతుల్లో 26 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసికా జోక్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది.

అనంతరం 119 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జమైకా తల్లవాస్ జట్టులో కెప్టెన్ క్రిస్ గేల్ జట్టుని ముందుడి నడిపించాడు. 36 బంతుల్లో 90 పరుగులు సాధించాడు. 10 ఓవర్లు మిగులుండగానే 10 వికెట్ల తేడాతో జమైకా తల్లవాస్ జట్టు గెలుపొందింది.

స్కోరు కార్డు:

English summary
St. Lucia Zouks 118/9 in 20 overs (Johnson Charles 29, Kevin Pietersen 26, Krishmar Santokie 3/24, Rusty Theron 3/19) lost to Jamaica Tallawahs 121/0 in 10 overs (Chris Gayle 90 not out, Chadwick Walton 25 not out). Captain and opener Chris Gayle hammered 9 sixes and 6 fours to lead Jamaica Tallawahs to a thumping 10-wicket victory over St. Lucia Zouks in the Caribbean Premier League (CPL) Twenty20 tournament on Sunday (June 28).
మీ వ్యాఖ్య రాయండి