Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

'ధోని-కోహ్లీ మధ్య సత్సంబంధాలే ఉన్నాయి'

Posted by:
Published: Tuesday, June 30, 2015, 19:38 [IST]

ముంబై: బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరిస్‌లో ఓటమిపాలైన తర్వాత టీమిండియాలో రెండు గ్రూపులున్నాయంటూ వార్తా కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. జట్టులో రెండు గ్రూపులు ఉన్నాయని, వన్డే కెప్టెన్ ధోని, టెస్టు కెప్టెన్ కోహ్లీల మధ్య విభేదాలు నెలకొన్నాయని మీడియా కోడై కూసింది.

ఈ నేపథ్యంలో టీమిండియా తాజా పరిణామాలపై టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి స్పందించారు. టీమిండియాలో ఎలాంటి సంక్షోభం తలెత్తలేదని తెలిపారు. ధోని, కోహ్లీల మధ్య సత్సంబంధాలే ఉన్నాయని స్పష్టం చేశారు.

'Biggest load of bull**** I have been hearing', says Ravi Shastri

ధోని, కోహ్లీలకు ఒకరంటే మరొకరికి గౌరవం ఉందని తెలిపారు. తాను డ్రస్సింగ్ రూంలో పారదర్శకత కోరుకున్నానని చెప్పారు. ఏదైనా విషయం చెప్పాలనుకుంటే, ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రెస్సింగ్ రూంలో అందరి ముందు చెప్పాలని తానే సూచించానని అన్నారు.

ఇలా చేయడం వల్ల ఆటగాళ్లలో విశ్వాసం ఉందని, ఒకరి కొసం మరొకరు ఆడతారని, ఒకరి విజయాలను మరొకరు ఆస్వాదిస్తారని రవిశాస్త్రి వివరించారు. డైరెక్టర్‌గా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడంపైనే తన దృష్టంతా ఉంటుందని ఈ మాజీ కెప్టెన్ తెలిపారు. 

English summary
"Biggest load of bull**** I have been hearing", Indian cricket team's director Ravi Shastri said today, dismissing reports of a rift between MS Dhoni and Virat Kohli.
మీ వ్యాఖ్య రాయండి