Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

జింబాబ్వే టూర్‌కు కెప్టెన్‌గా రహానే: సచిన్ స్పందన

Posted by:
Published: Tuesday, June 30, 2015, 12:49 [IST]

న్యూఢిల్లీ: జింబాబ్వే పర్యటనకు టీమిండియా కెప్టెన్‌గా ఎంపికైన యువ బ్యాట్స్‌మెన్ అజ్యంకె రహానేకు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే జింబాబ్వే పర్యటనలో అజ్యంకె రహానే రాణిస్తాడని సచిన్ పేర్కొన్నాడు.

2000 సంవత్సరంలో వచివరిసరిగా ముంబైకి చెందిన ఓ ఆటగాడు టీమిండియాకు కెప్టెన్‌గా వ్వవహారించింది సచిన్ టెండూల్కరే. సరిగ్గా 15 ఏళ్ల తర్వాత మళ్లీ ముంబైకి చెందిన 27 ఏళ్ల అజ్యంకె రహానే టీమిండియాకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

జింబాబ్వే పర్యటనకు సీనియర్లు ధోనీ, విరాట్ కోహ్లీలకు విశ్రాంతిని ఇచ్చి బీసీసీఐ సెలక్టర్లు యువ ఆటగాళ్లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో మంగళవారం క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ రహానే నిజాయితీ, మంచి పనివంతుడైన క్రికెటరని అన్నారు.

Feel happy for 'hard working cricketer' Rahane, says Tendulkar

అతని నిబద్ధత, అంకితం పట్ల ఎల్లప్పుడూ నేను ముగ్దుడయ్యానని చెప్పారు. అతనిని కెప్టెన్‌గా ఎంపిక చేయడం పట్ల గర్వపడాల్సిన నిర్ణయం తీసుకున్నారని చెప్పగలను అని పేర్కొన్నాడు. అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.

జింబాబ్వే పర్యటనలో మూడు వన్డేలు, రెండు టీ ట్వంటీలు ఆడనున్నారు. 15 మందితో కూడిన స్క్వాడ్‌ను బీసీసీఐ ప్రకటించింది.

జింబాబ్వే పర్యటనకు భారత జట్టు:

అజింక్యా రహానే (కెప్టెన్), మురళీ విజయ్, అంబటి రాయుడు, మనోజ్ తివారీ, కేదార్ జాదవ్, రాబిన్ ఊతప్ప, మనీష్ పాండే, హర్భజన్ సింగ్, అక్షర్ పటేల్, కర్ణ్ శర్మ, ధవల్ కులకర్ణి, స్టార్ట్ బిన్నీ, భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మ, సందీప్ శర్మలు.

English summary
Legendary Indian batsman Sachin Tendulkar today extended his greetings to new captain Ajinkya Rahane, hoping the youngster will do a good job during the upcoming Zimbabwe tour.
మీ వ్యాఖ్య రాయండి