Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

క్రికెట్ చదువే, మాటల్లో చెప్పలేను: భజ్జీ ఉబ్బితబ్బిబ్బు

Posted by:
Published: Tuesday, June 30, 2015, 9:43 [IST]

న్యూఢిల్లీ: దాదాపు నాలుగేళ్ల తర్వాత వన్డేకు ఎంపికైన హాఫ్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. జింబాబ్వే పర్యటనకు భారత వన్డే జట్టులో హర్భజన్ సింగ్ స్థానం దక్కించుకున్నాడు. అశ్విన్ స్థానంలో భజ్జీ వచ్చాడు.

దీనిపై భజ్జీ మాట్లాడుతూ.. బ్లూ జెర్సీ మళ్లీ ధరించనుండటం సంతోషంగా ఉందని చెప్పాడు. తాను ఎంతో సంతోషంగా ఉన్నానని, ఇది మాటల్లో చెప్పలేనిదన్నాడు. క్రికెట్ ఆడటమే తనకు తెలుసునని, కెరీర్ మొదటి నుంచి తాను ఇలాగే ఉంటున్నానని చెప్పాడు.

Harbhajan Singh ready for ODI challenge

భారత జట్టు కోసం తాను సర్వశక్తులూ ఒడ్డుతానని చెప్పాడు. క్రికెట్ కూడా ఓ విధంగా చదువులాంటిదేనని తెలిపాడు. పది నెలల తర్వాత వచ్చే వార్షిక పరీక్షల కోసం ఓ విద్యార్థి రాత్రింబవళ్లు చదువుతాడని, కానీ క్రికెటర్ మాత్రం నిత్యం పరీక్షనే అన్నాడు.

ఇప్పుడు జింబాబ్వే సిరీస్‌ను తాము మరో పరీక్షగా భావిస్తున్నామని చెప్పాడు. నేను దీని కోసం హార్డ్ వర్క్ చేస్తున్నానని చెప్పాడు. ఆలోచనలు పంచుకోవడానికి తాను ఇష్టపడతానని చెప్పాడు. క్రికెట్ అనేది జీవితం లాంటిదన్నాడు. ఇక్కడ నేర్చుకోవడాన్ని ఆపవద్దన్నాడు.

English summary
It’s been an exciting last two months for Harbhajan Singh following a return to Test cricket and the senior off spinner is now looking forward to the challenge of bowling in the limited-overs format.
మీ వ్యాఖ్య రాయండి