Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

బంగ్లా మీడియా వెకిలి: భారత క్రికెటర్లకు అరగుండు

Published: Tuesday, June 30, 2015, 9:38 [IST]

ఢాకా: భారత్‌పై తొలిసారి ఓ సిరీస్‌ విజయంతో బంగ్లా చరిత్ర సృష్టించింది. ఈ గెలుపుపై బంగ్లాదేశ్ మీడియా అతిగా స్పందిస్తోంది. అంతేగాక, వెకిలి ఫొటోలతో మీడియా రంగానికి తలవొంపులు తెస్తోంది. బంగ్లా ప్రముఖ పత్రిక ప్రోతమ్‌ అలో వీక్లీ మేగజైన్‌ రోష్‌ అలోలో.. క్రీడాస్ఫూర్తిని మరచి టీమిండియాను అవమానించేలా ఓ వ్యంగ్యాత్మక ప్రకటనను ప్రచురించింది.

ఆ ప్రకటనలో ఆఫ్‌ కటర్‌లతో బంగ్లా విజయంలో కీలకపాత్ర పోషించిన యువ బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రెహ్మాన్.. ఓ కటర్‌ పట్టుకుని ఉన్నాడు. అది అతని ఫేమస్‌ ఆఫ్‌ కటర్‌లను సూచించే విధంగా ఉంది.

‘టైగర్‌ స్టేషనరీ, మేడ్‌ బంగ్లాదేశ్‌, మిర్పూర్‌ స్టేడియం మార్కెట్లో ముస్తాఫిజుర్‌ కటర్‌ దొరుకుతుంది' అని బోర్డులో రాసి ఉంది. కింద అజింక్యా రహానె, రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, శిఖర్ ధవన్‌, రవీంద్ర జడేజా, అశ్విన్‌లు అరగుండులతో ఓ బ్యానర్‌ పట్టుకుని నిలబడి ఉన్నారు.

Renowned Bangladeshi newspaper tries to shame Team India with a distasteful ad

ఆ బ్యానర్‌పై ‘మేం ఉపయోగించాం. మీరూ వాడండి' అని రాసి ఉంది. క్రీడా స్ఫూర్తిని మంటగలిపే ఇలాంటి వ్యంగ్య ప్రయోగాలు ఇరు దేశాల మధ్య స్పర్ధలకు కారణమవుతాయని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక, ఆ ప్రకటనను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిందా పత్రిక. దీంతో ఆ బంగ్లా పత్రికపై భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘బంగ్లాదేశ్ భారత్‌పై ఒక్క సిరీస్ గెలిస్తేనే.. అక్కడి మీడియా ఇంత వెకిలిగా వ్యవహరిస్తోంది. టీమిండియా చేతిలో గతంలో ఎన్నో సిరీస్‌లను బంగ్లాదేశ్ ఓటమిపాలైంది. అప్పుడు భారత మీడియా బంగ్లాపై ఎలాంటి ఆరోపణలు, విమర్శలు చేయలేదు' అని ఓ భారత అభిమాని పేర్కొంది.

English summary
Bangladesh recently humiliated India in the three-match one-day international series, beating the visitors 2-1 at home. The win was Bangladesh's first ever series victory against India.
మీ వ్యాఖ్య రాయండి