Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

డబ్బులివ్వకుండా ఆడాలా: ఆల్ రౌండర్ ఆగ్రహం

Posted by:
Published: Thursday, July 2, 2015, 11:51 [IST]

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: తమకు డబ్బులు, ప్రోత్సాహకాలు సరిగా ఇవ్వడానికి బోర్డు అంగీకరించనప్పుడు తాము ఎలా అడతామని వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో ప్రశ్నించాడు.

ఆటగాళ్ల జీతాలకు సంబంధించి వెస్టిండీస్‌ క్రికెటర్ల సంఘం కొత్త ఒప్పందాన్ని అంగీకరించినట్లు తెలుస్తోందని, కొత్త ఒప్పందంపై తమకు ఎలాంటి సమాచారం లేదని, కనీసం మాకొచ్చే మొత్తంపై కనీస అవగాహన కూడా లేదని, ఇచ్చింది తీసుకుని క్రికెటర్లు ఆడాలని కోరుకోవడం బోర్డుకు తగదని, మళ్లీ టెస్టులు ఆడేందుకు బోర్డు ప్రోత్సాహకాలు కూడా అందించడం లేదని బ్రావో అన్నాడు.

Dwayne Bravo not keen on returning to play Tests after meeting Phil Simmons

డబ్బులు సరిగా ఇవ్వడం లేదంటూ భారత్‌తో పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని స్వదేశానికి వచ్చిన బ్రావోతో వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు చర్చలు సాగిస్తోంది. టెస్టు క్రికెట్లో పునరాగమనంపై బ్రావోతో విండీస్‌ కోచ్‌ ఫిల్‌ సిమన్స్‌ మాట్లాడాడు. ఐతే బ్రావో సుముఖత వ్యక్తం చేయలేదు.

English summary
All-rounder Dwayne Bravo says a meeting with West Indies head coach Phil Simmons has not convinced him that he should return to Test cricket because player conditions have not improved.
మీ వ్యాఖ్య రాయండి