Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

అమ్మకానికి ఆర్‌సిబి: దక్కించుకోనున్న జిందాల్

Published: Thursday, July 2, 2015, 10:02 [IST]

న్యూఢిల్లీ: అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సిబి) జట్టు ఫ్రాంఛైజీ మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ జట్టు యజమాని అయిన విజయ్ మాల్యా కంపెనీ అమ్మకానికి పెట్టింది. వ్యాపార దిగ్గజం సజ్జన్ జిందాల్ ఆధ్వర్యంలోని జెఎస్‌డబ్ల్యు గ్రూప్స్ ఆర్‌సీబీని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది.

ఇప్పటికి ప్రక్రియ పూర్తికాకున్నా, ఇరుపార్టీల మధ్య చర్చల్లో పురోగతి కనిపిస్తోంది. ఆర్‌సీబీ మాల్యా ఆధ్వర్యంలో నడుస్తున్నా.. ఇందులో అత్యధిక వాటా డియాగో కంపెనీదే. ఈ నేపథ్యంలో ‘ఆర్‌సీబీని రూ. 200-300 కోట్ల మధ్య ధర వెచ్చించి సొంతం చేసుకునేందుకు డియాగో కంపెనీతో చర్చిస్తున్నాం' అని జెఎస్‌డబ్ల్యు అధినేత జిందాల్ తెలిపారు.

JSW group reportedly close to $100 million takeover of Mallya's RCB

ఆర్‌సీబీ గత ఎనిమిది ఐపీఎల్ సీజన్లలో ఒక్కసారి కూడా టైటిల్ సాధించకున్నా.. ఆ జట్టుకు భారీగా అభిమానులున్నారు. 2008లో మాల్యా దాదాపు రూ. 70 కోట్లు వెచ్చించి ఈ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నాడు.

అయితే ఆర్‌సీబీ నిధులను మాల్యా.. కింగ్‌ఫిషర్, యూబీ గ్రూప్స్‌కు మళ్లించాడంటూ ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ (పీడబ్ల్యుసీ) తేల్చింది. దీంతో అత్యధిక షేర్‌వున్న డియాగో, మాల్యాపై విశ్వసనీయతను కోల్పోయి ఫ్రాంచైజీని బేరానికి పెట్టింది.

ఒకవేళ, ఆర్‌సీబీ అమ్ముడైతే మాత్రం ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్ తర్వాత యాజమాన్యం మారిన రెండో ఫ్రాంచైజీ అవుతుంది. బీసీసీఐ నిర్దేశించిన బ్యాంకు గ్యారెంటీ రూ. 100 కోట్లు ఛార్జెస్ యాజమాన్యం చెల్లించకపోవడంతో ఆ ఫ్రాంచైజీని బోర్డు రద్దుచేసింది. దీంతో ఆ స్థానంలో 2013లో వచ్చిన సన్ టీవీ నెట్‌వర్క్ యాజమాన్యం సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరుతో ఫ్రాంచైజీని నడిపిస్తున్న విషయం తెలిసిందే.

English summary
Royal Challengers Bangalore (RCB), the Virat Kohli-led Indian Premier League team, could soon have a new owner.
మీ వ్యాఖ్య రాయండి