Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఫ్యాన్స్ కోసం.. నేనెలాంటి తప్పు చేయలేదు: రైనా

Posted by:
Published: Thursday, July 2, 2015, 17:03 [IST]

ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ చేసిన ఆరోపణల పైన సురేష్ రైనా స్పందించాడు. తాను ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పాడు. తన పైన ఆరోపణలు చేసిన లలిత్ మోడీ పైన న్యాయపరమైన చర్యలు తీసుకునే విషయమై ఆలోచిస్తున్నానని చెప్పాడు.

సరైన స్ఫూర్తితోనే క్రికెట్ ఆడానని చెప్పాడు. ఈ విషయాన్ని అభిమానులు గుర్తించాలని విజ్ఞప్తి చేశాడు. ఇప్పటి వరకు ఎలాంటి అనైతిక చర్యల్లో తాను పాలుపంచుకోలేదని తెలిపాడు. ఏ జట్టుకు ఆడినా క్రికెట్ సర్వస్వంగా భావించానని చెప్పాడు.

Was never involved in wrongdoing: Raina

కాగా, ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ ఆరోపణల పైన బీసీసీఐ సోమవారం నాడే స్పందించింది. ముగ్గురు క్రికెటర్ల పైన లలిత్ బాంబు పేల్చిన విషయం తెలిసిందే. దీనిని బీసీసీఐ ఖండించింది. ఆటగాళ్లకు క్లీన్ చిట్ ఇచ్చింది. బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ... అలాంటిదేమీ లేదని చెప్పాడు.

English summary
Rejecting Lalit Modi's allegations that he accepted bribes from a businessman, Indian cricketer Suresh Raina today said he is considering legal action against the former IPL Commissioner and insisted that he was never involved in any wrongdoing.
మీ వ్యాఖ్య రాయండి