Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన జేమ్స్ ఫాల్కనర్

Posted by:
Published: Sunday, July 5, 2015, 15:30 [IST]

ఆస్ట్రేలియా క్రికెటర్ జేమ్స్ ఫాల్కనర్ డ్రింక్ అండ్ డ్రైవింగ్‌లో పట్టుబడ్డాడు. మాంచెస్టర్‌లో అతను పట్టుబడ్డాడు. న్యాయస్థానం ఎదుట పోలీసులు హాజరు పరిచారు. దీంతో ఫాల్కనర్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో పాటు ఈ నెల 21న హాజరు కావాలని ఆదేశించింది.

క్రికెట్ ఆస్ట్రేలియా ఫాల్కనర్ చర్య పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. యువ క్రికెటర్లకు ఆదర్శంగా ఉండాల్సిన సీనియర్లు తప్పుదోవపట్టడం సరికాదని హెచ్చరించింది. తాగి వాహనాలు నడపడంలో ఉండే నష్టాలను గుర్తించాలని సూచించినట్లు జట్టు పెర్ఫార్మెన్స్ ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ పాట్ హోవార్డ్ చెప్పాడు.

Ashes tour: James Faulkner may miss one-day series over drink-driving charge

ఇదిలా ఉండగా, ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆడనుంది. ఇంగ్లండ్‌తో ఐదు వన్డేలు, ఐదు టెస్టులు ఆడనుంది. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్‌కు జేమ్స్ ఫాల్కనర్ దూరమయ్యే అవకాశముందని తెలుస్తోంది.

English summary
Ashes tour: James Faulkner may miss one-day series over drink-driving charge
మీ వ్యాఖ్య రాయండి