Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

టీ20లో చెలరేగిన మెక్‌కల్లమ్: 64 బంతుల్లో 158

Posted by:
Published: Sunday, July 5, 2015, 12:34 [IST]

లండన్: న్యూజిలాండ్ విధ్యంసకర బ్యాట్స్‌మెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ టీ20ల్లో మరోసారి రెచ్చిపోయాడు. ఇంగ్లింగ్ టీ20 బ్లాస్ట్ టోర్నమెంట్లో అతను డెర్బీ షైర్ బౌలర్లను ఊచకోత కోసి, సరికొత్త రికార్డుని నెలకొల్పాడు.

వార్విక్ షైర్‌కు ప్రాతనిధ్యం వహిస్తున్న మెక్ కల్లమ్ 64 బంతుల్లో 158 పరుగులు చేశాడు. డెర్బిషైర్‌ బౌలింగ్‌ను చీల్చి చెండాడిన మెకల్లమ్‌ కేవలం 42 బంతుల్లో సెంచరీ చేయడం విశేషం.11 సిక్స్‌లు, 11 ఫోర్లతో టి-20ల్లోనే రెండో అత్యధిక స్కోరును నమోదు చేశాడు

Brendon McCullum smashes 158 not out to set T20 Blast record

టీ20ల్లో తన పేరిటే ఉన్న రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరును మెక్ కల్లమ్ సమం చేశాడు. ఏడేళ్ల కిందట ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కత్తా తరుపున మెక్ కల్లమ్ 73 బంతుల్లో 158 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు వెస్టిండిస్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ పేరిట ఉంది. 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో క్రిస్‌ గేల్‌ బెంగుళూరు తరుపున పూణె వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 175 పరుగులు చేశాడు.

English summary
New Zealand captain Brendon McCullum's explosive hitting saw him set a new record in the English T20 Blast competition with a blistering 158 not out off 64 balls for his county Warwickshire.
మీ వ్యాఖ్య రాయండి