Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

క్రికెట్‌కు గుడ్‌బై: 'కుటుంబ సభ్యులతో చర్చించే'

Posted by:
Published: Sunday, July 5, 2015, 12:52 [IST]

లండన్: ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరిస్ జులై 8 నుంచి మొదలవుతుండగా ఆస్టేలియా ఫాస్ట్ బౌలర్ ర్యాన్‌ హారిస్‌ క్రికెట్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. మూడు ఫార్మెట్ల నుంచి తప్పుకుంటున్నట్లు 35 ఏళ్ల హారిస్‌ శనివారం ప్రకటించాడు.

చాలా రోజులుగా వేధిస్తున్న కుడికాలి మోకాలి గాయం తిరగబెట్టడంతో హారిస్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇంకో మూడు రోజుల్లో ఆరంభమయ్యే యాషెస్ సిరీస్‌లో హారిస్ ఆడాల్సి ఉంది. అయితే ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో గాయం కారణంగా ఇబ్బందులు పడ్డాడు.

పరీక్షలు చేయించగా యాషెస్ సిరిస్‌లో ఆడటం అసాధ్యమని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌కే వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడు. యాషెస్ సిరిస్ కోసమని ఈ ఏడాది ఆస్టేలియాలో జరిగిన వరల్డ్ కప్ నుంచి కూడా తప్పుకున్నాడు.

ఈ సందర్భంగా హారిస్ మాట్లాడుతూ స్కాన్ ఫలితాలు చూశాక, నా కుటుంబ సభ్యులతో చర్చించి క్రికెట్‌కు దూరమవ్వడమే మంచిదని నిర్ణయించుకున్నానని చెప్పాడు. హారిస్ ఆస్టేలియా తరఫున 27 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి 113 వికెట్లు పడగొట్టాడు. 21 వన్డేల్లో 18.90 సగటుతో 44 వికెట్లు తీశాడు.

English summary
Australia's fast bowler Ryan Harris today announced his retirement from all forms of the game with immediate effect after he was ruled out of the Ashes 2015 series due to a knee injury.
మీ వ్యాఖ్య రాయండి