Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

కోహ్లీ దూకుడుతో నష్టం లేదు: వివ్ రిచర్డ్స్, ప్రశంసలు

Posted by:
Published: Monday, July 6, 2015, 12:23 [IST]

భారత జట్టు టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పైన వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లీ సారథ్యంలో భారత క్రికెట్ జట్టుకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నాడు. జట్టు వన్డే, టీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పోలిస్తే కోహ్లీ భిన్నంగా ఉంటాడని, కోహ్లీ నేతృత్వంలో భారత క్రికెట్ అత్యున్నత శిఖరాలకు చేరుతుందన్నాడు.

Virat Kohli

మైదానంలో దూకుడుగా వ్యవహరించే కోహ్లీ, మ్యాచ్ నాణ్యతను పెంచుతాడన్నాడు. దూకుడుగా ఉంటూనే కోహ్లీ అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడని చెప్పాడు. కోహ్లీ బ్యాటింగ్ శైలి కూడా అద్భుతమని కితాబిచ్చాడు.

ధోనీతో పోల్చితే కోహ్లీ విభిన్నమైన వ్యక్తి అన్నాడు. ఎవరైనా మైదానంలో దూకుడుగా ఉన్నారంటే అది మ్యాచ్ నాణ్యత పెంచుతుందన్నాడు. కోహ్లీ భవిష్యత్తులో మరెన్నో సంచలనాలు సృష్టిస్తాడని వివ్ రిచర్డ్స్ ఈ సందర్భంగా చెప్పాడు. విరాట్ వైఖరితో ఎలాంటి నష్టం లేదన్నాడు.

English summary
Future Of Indian Cricket Looks Bright in Virat Kohli's Hands, Says Viv Richards
మీ వ్యాఖ్య రాయండి