Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

జింబాబ్వే టూర్‌కు కర్ణ్ శర్మ దూరం: బీసీసీఐ

Posted by:
Published: Monday, July 6, 2015, 13:36 [IST]

బెంగుళూరు: జింబాబ్వే పర్యటనకు ఎంపికైనా టీమిండియా లెగ్ స్ఫిన్నర్ కర్ణ్ శర్మను తప్పిస్తున్నట్లు బీసీసీఐ అధికారిక ప్రకటనలో పేర్కొంది. గాయం కారణంగానే అతడు ఈ సిరిస్‌కు దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది.

అజ్యంకె రహానేను కెప్టెన్‌గా ప్రకటిస్తూ గత వారమే జింబాబ్వే పర్యటనకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే కర్ణ్ శర్మ చేతి మధ్య వేలు గాయం కారణంగా ఈ సిరిస్‌కు దూరమైనట్లు ప్రకటించింది. అతని స్ధానంలో ఎవరినీ ఎంపిక చేయలేదని కూడా తెలిపింది.

Leg-spinner Karn Sharma ruled out of Zimbabwe tour

జులై 7న జింబాబ్వేకు చేరుకోనున్న టీమిండియా 3 వన్డేలు, రెండు టీట్వంటీలు ఆడనుంది. తొలి వన్డే జులై 10న ఆడనుంది. జింబాబ్వే పర్యటనకు టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వన్డే కెప్టెన్ ధోనిలకు విశ్రాంతి నిచ్చిన సంగతి తెలిసిందే.

English summary
India's leg-spinner Karn Sharma has been ruled out of the Zimbabwe tour due to an injury, the Board of Control for Cricket in India (BCCI) said today.
మీ వ్యాఖ్య రాయండి