Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

కెప్టెన్సీపై రహానే: భజ్జీ రీఎంట్రీ, జింబాబ్వే టూర్‌‌‌పై ఇలా

Posted by:
Published: Tuesday, July 7, 2015, 9:48 [IST]

ముంబై: 'ఉపఖండంలోని మందకొడి పిచ్‌లపై స్ట్రైక్ రొటేట్ చేయడానికి ఇబ్బంది పడతాడు' బంగ్లాదేశ్ పర్యటనలో అజ్యంకె రహానేను జట్టు నుంచి తప్పించడానికి వన్డే కెప్టెన్ ధోని చెప్పిన మాటలివి. అయితే ధోని మాటలను సానుకూలంగానే తీసుకున్నానని రహానే స్పష్టం చేశాడు.

'ధోని భాయ్ నా ఆటపై తన అభిప్రాయాన్ని నాకు చెప్పాడు. దాన్ని నేను సానుకులంగా తీసుకున్నా. బంగ్లాదేశ్ పర్యటన నా దృష్టిలో గతం. వన్డేల్లో నిలకడగా రాణించడమే నా లక్ష్యం' అని టీమిండియా జింబాబ్వే పర్యటనకు బయలుదేరడానికి ముందు ప్రెస్ మీట్‌లో అన్న మాటలివి.

అంతేకాదు ధోనీ నాయకత్వం భేష్‌ అని రహానె ప్రశంసించాడు. అయితే సారథిగా తనకో దృక్పథం ఉందని చెప్పాడు. ‘కెప్టెన్‌గా నాకో స్టైలుంది. నా వ్యూహాలు నాకున్నాయి. అయితే మ్యాచ్‌ సమయంలో ధోనీ ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. కూల్‌గా ఉండడాన్ని మహీ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నాన'ని చెప్పాడు.

Ajinkya Rahane speaks on captaincy, Zimbabwe tour and the axeing in Bangladesh

వన్డేలు, టెస్టుల్లోకి పునరాగమనం చేసిన ఆఫ్ స్పిన్నర్ హార్భజన్ సింగ్‌పై రహానే ప్రశంసలు కురిపించాడు. 'భజ్జుపా (ముద్దుపేరు) భారత్ తరుపున గొప్ప ప్రదర్శనలు చేశాడు. అతడు జట్టులో ఉన్నందుకన సంతోషంగా ఉంది. అతడు ఎంతో అనుభవజ్ఞుడు. అవసమైనప్పుడు అతడి సలహాలు తీసుకుంటా' అని రహానే చెప్పాడు.

ఇక జింబాబ్వే పర్యటనలో ఓపెనర్‌గా బరిలోకి దిగుతారా అన్న ప్రశ్నకు రహానే స్పష్టమైన సమాధానం చెప్పలేదు. టీమిండియా తరుపున రహానే ఇప్పటికే 15 టెస్టులు, 55 వన్డేలు, 11 ట్వంటీ20లు ఆడాడు.

English summary
India's ODI captain for Zimbabwe tour, Ajinkya Rahane on Monday said all 15 players are important in the squad and there is no difference between seniors and juniors.
మీ వ్యాఖ్య రాయండి