Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

వద్దు ప్లీజ్: ఇల్లుమారుతున్న కోహ్లీ, పక్కవాళ్లు అప్‌సెట్

Posted by:
Published: Tuesday, July 7, 2015, 12:13 [IST]

న్యూఢిల్లీ: భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఢిల్లీలో ఇల్లు మారనున్నట్లుగా తెలుస్తోంది. ఆయన గుర్గావ్ వెళ్లనున్నారు. ప్రస్తుతం కోహ్లీ పశ్చిమ విహార్ ప్రాంతంలోని మీరా బాగ్‌లో ఉంటున్నాడు. కోహ్లీని ఆ ప్రాంతంలోని వారు చీకూ అని పిలుస్తుంటారు. ఇప్పుడు కోహ్లీ ఇల్లు మారుతుండటంతో వారు అప్ సెట్ అవుతున్నారు.

విరాట్‌ మీద అభిమానంతో తమ కాలనీ పేరును స్థానికులు విరాట్‌ విహార్‌ అని కూడా మార్చేసుకున్నారు. కానీ ఇప్పుడు కోహ్లి ఈ కాలనీ నుంచి గుర్గావ్‌లోని కొత్త ఇంటికి వెళ్లిపోతుండటంతో వారి బాధ పడుతున్నారు. ఇది తెలిసి విరాట్‌ విహార్‌ కాలనీలో చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

'Cheeku Bhaiya' Virat Kohli leaves Paschim Vihar, neighbours upset

కోహ్లి వల్లే మా కాలనీకి విరాట్‌ విహార్‌ అని పేరు వచ్చిందని, భారత క్రికెట్‌ స్టార్‌ మా కాలనీలో ఉండటం మాకు గర్వకారణమని, విరాట్‌ నిర్ణయం మాకు చాలా బాధ కలిగిస్తోందని చెబుతున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలన్న నిర్ణయంపై కోహ్లి పునరాలోచించాలని కోరుతున్నారు. అతనిని వెళ్లనిచ్చేది లేదంటున్నారు.

కోహ్లీ నిర్ణయంతో తాము పూర్తిగా అసంతృప్తికి లోనయ్యామంటున్నారు. అతనిని తాము అరుదుగా కలుస్తుంటామని, ఆయన క్రికెట్‌తో బిజీ కాబట్టి ఎప్పుడు వెళ్తాడో, ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదని చెప్పాడు. తమ ప్రాంతంలోని పిల్లలు కోహ్లీని చూసి నేర్చుకుంటున్నారని చెబుతున్నారు.

English summary
Indian cricketer Virat Kohli is reportedly shifting to Gurgaon. Currently living in Paschim Vihar's posh Meera Bagh, the vice-captain of the Indian cricket team will soon shift with his family. Popularly known as 'Cheeku' in his neighbourhood, Kohli's neighbours are apparently quite upset with his decision to shift.
మీ వ్యాఖ్య రాయండి