Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

టెస్ట్ ర్యాంకులు: 3వ స్ధానానికి పాక్, 5లో భారత్

Posted by:
Published: Tuesday, July 7, 2015, 14:49 [IST]

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు క్రికెట్‌కు సంబంధించి తాజా ర్యాంకుల జాబితాను విడుదల చేసింది. భారత్‌ 97 రేటింగ్‌ పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. మంగళవారం శ్రీలంకతో ముగిసిన టెస్టు మ్యాచ్‌లో పాకిస్ధాన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో ఒక్కసారిగా 3 స్ధానాలు ఎగబాకి మూడో స్ధానంలో నిలిచింది.

అంతక ముందు వరకు నాల్గవ స్ధానంలో ఉన్న భారత్ ఒక స్ధానం దిగజారి ఐదో స్ధానంలో నిలిచింది. శ్రీలంక పర్యటనకు ముందు 97 పాయింట్లతో పాకిస్ధాన్ ఆరో స్ధానంలో ఉంది. 2-1తో సిరిస్‌ను పాకిస్దాన్ కైవసం చేసుకోవడంతో పాయింట్ల పట్టికలో గట్టి పోటీ ఏర్పడింది.

శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో పాకిస్ధాన్ ఆటగాడు 171 పరుగులు సాధించడంతో అనూహ్య విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా తొలి స్ధానంలో ఉండగా, రెండు, మూడు స్థానాల్లో ఆస్ట్రేలియా, పాకిస్ధాన్‌లు నిలిచాయి.

ఆస్టేలియా - ఇంగ్లాండ్‌ల మధ్య బుధవారం నుంచి ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్‌ 3-0తో నెగ్గితే రెండో ర్యాంక్‌కు ఎగబాకే అవకాశం ఉంది. అయితే ఆస్టేలియా సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తే ఇంగ్లాండ్ ఏడో ర్యాంక్‌కు దిగజారుతుంది.

ఇక బ్యాటింగ్‌ విభాగంలో ఆస్టేలియా వైస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ నెంబర్ వన్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా విరాట్ కోహ్లీ ఒక్కడే భారత్ తరపున టాప్ టెన్‌లో ఉన్నాడు. భారత బౌలర్లలో ఒక్కరూ టాప్‌-టెన్‌లో చోటు దక్కించుకోలేదు.

ICC Test Rankings: Pakistan jump to 3rd, push India to 5th

టెస్టు ర్యాంకింగ్స్ పాయింట్ల పట్టిక: (వరుసగా ర్యాంక్, జట్టు, పాయింట్లు)

1 South Africa 130
2 Australia 111
3 Pakistan 101
4 New Zealand 99
5 India 97
6 England 97
7 Sri Lanka 92
8 West Indies 81
9 Bangladesh 41
10 Zimbabwe 5

English summary
Pakistan jumped three places to 3rd in the ICC Test Championship table following a record 7-wicket victory over Sri Lanka in the third and final Test in Pallekele on Tuesday. The result meant India were pushed by 1 place to 5th.
మీ వ్యాఖ్య రాయండి