Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ట్వీట్: తండ్రి కాబోతున్న ఆసీస్ కెప్టెన్ క్లార్క్

Posted by:
Published: Wednesday, July 8, 2015, 14:53 [IST]

ఆస్టేలియా కెప్టెన్ మైఖెల్ క్లార్క్ తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా క్లార్కే బుధవారం ట్విట్టర్‌ ద్వారా అభిమానులకు వెల్లడించారు. మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న మైఖెల్ క్లార్క్ తమ కుటుంబంలోకి తొలి పాప రాబోతోందంటూ ట్విట్ చేశాడు.

తన భార్య కైలీతో ఉన్న ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇది ఇలా ఉంటే ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్ట్‌ల యాషెస్‌ సిరీస్‌ బుధవారం నుంచి మొదలు కానుంది. కార్డిఫ్‌ వేదికగా తొలి టెస్ట్‌ జరగనుంది. చివరిసారిగా 2013లో జరిగిన యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ 0-5తో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది.

Australia captain Michael Clarke to be a dad

దీంతో ఈసారి సొంతగడ్డపై ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఇంగ్లిష్‌ జట్టు గట్టి పట్టుదలతో ఉంది. అయితే మరోసారి యాషెస్‌ ట్రోఫీని ముద్దాడాలని క్లార్క్‌సేన ఉవ్విళ్లూరుతోంది. 

English summary
Australia captain Michael Clarke took the occasion of the start of the first Ashes test against England to announce that he and his wife, Kyly, are expecting their first child.
మీ వ్యాఖ్య రాయండి