Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

విషాదం: బ్రిటిష్ తమిళ లీగ్‌లో యువ క్రికెటర్ మృతి

Posted by:
Updated: Wednesday, July 8, 2015, 8:45 [IST]

లండన్: క్రికెట్ ప్రపంచం మరోసారి విషాదంలో మునిగిపోయింది. బ్రిటన్‌లో ఓ తమిళ సంతతి క్రికెటర్ మృతి చెందాడు. బవలన్ పద్మనాభన్ (24) అనే క్రికెటర్ సర్రే కౌంటీలో నిర్వహించిన బ్రిటిష్ తమిళ లీగ్‌‌లో మణిపాయ్ పారిష్ స్పోర్ట్స్ క్లబ్ తరుపున ఆడుతుండగా ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది.

పద్మనాభన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బంతి అతని ఛాతీకి బలంగా తాకింది. దీంతో అతను మైదానంలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని హుటాహుటిన ఎయిర్ అంబులెన్స్‌లో సమీపంలోని కింగ్ స్టన్ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.

British Tamil cricketer dies after being hit on the chest by ball

ఛాతీకి బలమైన దెబ్బ తగలడంతో బవలన్ పద్మనాభన్ మృత్యువాత పడ్డాడు. బంతి బలంగా తగలడంతో గుండె ఫెయిల్ అవడం వల్లనే చనిపోయి ఉండాడని వైద్యులు చెబుతున్నారు. గతేడాది నవంబర్‌లో సిడ్నీ జరిగిన ఓ మ్యాచ్‌లో ఆస్టేలియా బ్యాట్స్‌మెన్ ఫిలిప్ హ్యూస్ కూడా ఇదే విధంగా మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.

Story first published:  Wednesday, July 8, 2015, 8:36 [IST]
English summary
A British Tamil batsman died after being hit by a ball on the chest while turning up for Manipay Parish Sports Club in division three of the British Tamil League.
మీ వ్యాఖ్య రాయండి