Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

అనుష్కతో విదేశాల్లో కోహ్లీ: బైక్ రిపేరింగ్ పనిలో ధోనీ

Posted by:
Published: Wednesday, July 8, 2015, 18:57 [IST]

రాంచీ: భారత జట్టు వన్డే, టీ 20 జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి చాలా రోజుల తర్వాత విశ్రాంతి దొరికింది. జింబాబ్వే పర్యటనకు సీనియర్లకు విశ్రాంతిని ఇచ్చారు. ఏమాత్రం సమయం దొరికినా ధోనీ బైకుపై చక్కెర్లు కొడతాడనే విషయం తెలిసిందే.

అయితే, ధోనీ తన పుట్టిన రోజు నాడు బైకులను రిపేర్ చేస్తూ బిజీగా గడిపాడు. ఇంటిలోని గ్యారేజీకి కొంతమంది మెకానిక్‌లను పిలిపించుకున్నాడు. ధోనీ స్పానర్లను చేతిలో పట్టుకొని బైకులని రిపేరింగ్ చేసే పనిలో స్వయంగా పాల్గొన్నాడు. ధోనీ పసుపు పచ్చ టీ షర్ట్ ధరించాడు.

MS Dhoni seen busy in bike repairing all day on birthday

కాగా, జింబాబ్వే పర్యటనకు బీసీసీఐ సీనియర్లకు విశ్రాంతిని ఇచ్చిన విషయం తెలిసిందే. ధోనీ, విరాట్ కోహ్లీ తదితరులకు విశ్రాంతి దొరికింది. మరోవైపు, విరాట్ కోహ్లీ తన ప్రేయసి అనుష్క శర్మతో సౌతాఫ్రికాలో చక్కెర్లు కొడుతున్నాడు.

English summary
MS Dhoni seen busy in bike repairing all day on birthday
మీ వ్యాఖ్య రాయండి