Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఏడాదిలో వెయ్యి రోజులు: ధోనీకి సచిన్ ట్వీట్, ప్రత్యేకం

Posted by:
Published: Wednesday, July 8, 2015, 13:01 [IST]

ముంబై: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మంగళవారం నాడు 34వ వసంతంలోకి ప్రవేశించాడు. ఈ సందర్భంగా అతనికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వచ్చాయి. అభిమానులు సామాజిక అనుసంధాన వేదికల్లో శుభాకాంక్షలు తెలిపారు.

అయితే, అందులో ప్రత్యేకంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ట్వీట్ ఉంది. 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ విజయం అనంతరం మహేంద్ర సింగ్ ధోనీని తాను ఆలింగనం చేసుకుంటున్న ఫోటోను ట్విట్టర్‌లో సచిన్ టెండుల్కర్ పోస్ట్ చేశాడు.

Sachin Tendulkar’s special wish for MS Dhoni: Tum jiyo hazaroon saal…

అనంతరం 'మహీకి జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు వెయ్యేళ్లు వర్ధిల్లాలి. ఒక్కో ఏడాదిలో వెయ్యి రోజులు ఉండాలి' అంటూ ట్వీట్ చేశాడు. కాగా, ధోనీకి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వచ్చాయి.

English summary
MS Dhoni, on his 34th b’day, got plenty of messages on Twitter but the one which stood out was from legendary batsman Sachin Tendulkar.
మీ వ్యాఖ్య రాయండి