Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

బీసీసీఐకి షాక్: కొచ్చికి రూ.550 కోట్లు చెల్లించండి

Posted by:
Published: Thursday, July 9, 2015, 12:39 [IST]

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి వేటుకు గురైన కొచ్చి టస్కర్స్ కేరళ ఫ్రాంచైజీకి రూ.550 కోట్లు చెల్లించాలని బీసీసీఐకి ఆర్బిట్రేటర్ ఆదేశించారు. ఆర్బిట్రేటర్ కోర్టు కొచ్చికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఆ ఫ్రాంచైజీ ఐపీఎల్లో ఆడేందుకు ఆసక్తి చూపిస్తోందని సమాచారం. ఇది బీసీసీఐకి గట్టి దెబ్బ.

కోచి టస్కర్స్‌ ఫ్రాంఛైజీని రద్దు చేసి, ఆ ఫ్రాంఛైజీ ఇచ్చిన బ్యాంకు గ్యారంటీని సొమ్ము చేసుకున్న క్రికెట్‌ బోర్డు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. కొచ్చికి రూ.550 కోట్లు చెల్లించాలని ఆర్బిట్రేటర్‌ ఆర్‌సి లహోటి ఆదేశించారు.

2010లో రెండీవూ స్పోర్ట్స్‌ వరల్డ్‌ రూ.1,560 కోట్లు వెచ్చించి కోచి ఫ్రాంఛైజీని సొంతం చేసుకుంది. ఐతే ఒప్పందానికి విరుద్ధంగా 2010లో ఐపీఎల్‌ మ్యాచ్‌ల సంఖ్యను కుదించినందుకు తాము చెల్లించాల్సిన ఫీజును తగ్గించాలని కోచి పలుసార్లు విజ్ఞప్తి చేసినా బోర్డు ఒప్పుకోలేదు.

BCCI asked to pay Rs 550 crore to IPL franchise Kochi Tuskers

ప్రతి ఏటా ఫ్రాంఛైజీలు బీసీసీఐకి బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలి. ఫ్రాంఛైజీ ఏర్పడినప్పుడు గ్యారంటీ సమర్పించిన కోచి ఆ తర్వాత ఏడాది ఇవ్వలేదు. బోర్డు చేసిన విజ్ఞప్తిని పట్టించుకోలేదు. ఆరు నెలలు వేచి చూసిన బోర్డు నిబంధనలు ఉల్లంఘించిందన్న కారణంతో 2011లో కోచి ఫ్రాంఛైజీని రద్దు చేసింది.

2010లో ఆ ఫ్రాంఛైజీ ఇచ్చిన పూచీకత్తును సొమ్ము చేసుకుంది. దీనిని కోచి ఫ్రాంఛైజీ సవాల్‌ చేసింది. గ్యారంటీని సొమ్ము చేసుకోక ముందు కోచి.. బోర్డుకు రూ.340 కోట్లు చెల్లించింది. ఇప్పుడు ఆర్బిట్రేటర్ కోచికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. అయితే, తమకు డబ్బు అవసరం లేదని, ఐపీఎల్లో ఆడనిస్తే సరి అని కోచ్చి చెబుతోంది. మరోవైపు, ఈ తీర్పును సవాల్ చేయాలని బోర్డు యోచిస్తోంది.

English summary
The BCCI today indicated it will appeal against former Chief Justice of India RC Lahoti's report that went in favour of Kochi Tuskers Kerala, the erstwhile IPL franchise whose contract was terminated by the Board in 2011 because of an alleged breach of contract.
మీ వ్యాఖ్య రాయండి