Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఆగస్ట్-సెప్టెంబర్‌లో టీమిండియా శ్రీలంక టూర్: వివరాలు

Posted by:
Published: Thursday, July 9, 2015, 16:00 [IST]

న్యూఢిల్లీ: శ్రీలంకలో టీమిండియా ఆగస్టులో మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. ఆగస్టు 3వ తేదీన కొలంబోకు టీమిండియా చేరుకుంటుంది. ఆ తర్వాత మూడు రోజుల పాటు జరగనున్న వార్మప్ మ్యాచ్‌లో పాల్గొంటుంది.

ఆ తర్వాత ఆగస్టు 12 నుంచి ప్రారంభంకానున్న తొలి టెస్టు మ్యాచ్‌ ఆడుతుంది. శ్రీలంకతో జరగనున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను బీసీసీఐ అధికారికంగా గురువారం ప్రకటించింది. ఈ మూడు టెస్టు మ్యాచ్‌లు శ్రీలంకలోని గల్లె, తమిళ యూనియన్ ఓవెల్, ఎస్ఎస్సీ కొలంబోలో జరుగుతాయి.

శ్రీలంకలో భారత పర్యటన: పూర్తి సమాచారం

Full Schedule of Team India's tour to Sri Lanka in August-September 2015

ఆగస్టు 3: కొలంబోకు టీమిండియా చేరుకుంటుంది.

ఆగస్టు 6 నుంచి 8 వరకు:(గురువారం నుంచి శనివారం) - 3 రోజుల వార్మప్ మ్యాచ్ (ఆర్ ప్రేమదాస స్టేడియం)

ఆగస్టు 12 నుంచి 16: (బుధవారం నుంచి ఆదివారం) - గల్లెలో తొలి టెస్టు

ఆగస్టు 20 నుంచి 24: (గురువారం నుంచి సోమవారం) - కొలంబోలోని తమిళ యూనియన్ ఓవెల్ - రెండో టెస్టు

ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 1: (శుక్రవారం నుంచి గురువారం) - కొలంబోలోని సిన్హలేసే స్పోర్ట్ క్లబ్ - మూడవ టెస్టు

సెప్టెంబర్ 2: (బుధవారం) - భారత్‌కు తిరుగు పయనం

English summary
India will play 3 Tests in Sri Lanka next month, the Board of Control for Cricket in India (BCCI) confirmed today.
మీ వ్యాఖ్య రాయండి