Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఇండియాను వణికించిన చిగుంబుర: ఉత్కంఠ గెలుపు

Updated: Friday, July 10, 2015, 20:33 [IST]

హరారే: తెలుగు తేజం అంబటి రాయుడు అజేయ సెంచరీతో భారత్ జింబాబ్వేపై తొలి వన్డేలో విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచులో భారత్ కేవలం నాలుగు పరగులు తేడాతో విజయం సాధించింది. జింబాబ్వే ఆటగాడు ఎల్టన్ చిగుంబర భారత్‌ను వణికించాడు. భారత్ ఆరు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేయగా, జింబాబ్వే 256 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఏడు వికెట్ల నష్టానికి నిర్ణీత 50 ఓవర్లలో 251 పరుగులు చేసి, దాదాపు గెలిచినంత పనిచేసింది. ఎల్టోన్ చిగుంబుర 104 పరుగులతో అజేయంగా నిలిచాడు.

బ్యాటింగ్‌లోనూ అర్థ సెంచరీతో చెలరేగిన స్టువర్ట్ బిన్ని రెండు వికెట్లు తీసుకుని భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అక్షర్ పటేల్‌ కూడా రెండు వికెట్లు తీసుకున్నాడు. భువనేశ్వర్ కుమార్, కులకర్ణి, హర్భజన్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచులో కెప్టెన్‌గా అజింక్యా రహనేకు తొలి మ్యాచులోనే విజయం లభించింది.

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో భారత్ నిర్దేశించిన 256 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు జింబాబ్వే బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా సిబంద, ఛిబాబలు దిగారు. 3 పరుగులు చేసిన చిభాబ.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత 20 పరుగులు చేసిన సిబంద.. బిన్నీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

34 పరుగులు చేసిన మసకడ్జ, విలియమ్స్(0) పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యారు. ఆ తర్వాత సికిందర్ రాజా 37, ముతుంబామి 7 పరుగులు చేసి ఔటయ్యారు.  ప్రస్తుతం చిగుంబర 62, క్రెమర్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. 41.5 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయిన జింబాబ్వే 187 పరుగులతో ఆట కొనసాగిస్తోంది.

1st ODI: Zimbabwe win toss, opt to bowl first against India

అంతకుముందు, టాస్ గెలిచిన జింబాబ్వే బౌలింగ్ ఎంచుకోవడంతో టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా అజింక్యా రహానే, మురళీ విజయ్‌లు దిగారు. అయితే 9 బంతులు ఆడి 1 పరుగు చేసిన మురళీ విజయ్.. విటోరి బౌలింగ్ ఔటయ్యాడు.

ఆ తర్వాత అంబటి రాయుడు మైదానంలో అడుగుపెట్టాడు. 49 బంతుల్లో 34 పరుగులు చేసిన రహానే తిరిపనో బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత తివారీ 2, ఉతప్ప 0, జాదవ్ 5 పరుగులకే వెనుదిరగడంతో భారత్ కష్టాల్లో పడింది. అయితే అంబటి రాయుడు క్రీజులో ఉండి ఒంటరి పోరాటం చేశాడు. రాయుడు 134 బంతుల్లో 124 పరుగులు చేసి అజేయంగా నిలువగా, బిన్నీ 77 పరుగులు చేసి ఔటయ్యాడు. అక్షర్ పటేల్ 2 పరుగులతో అజేయంగా ఉన్నాడు. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన భారత్ 255 పరుగులు చేసింది.

కాగా, ఈ సిరీస్‌లో అజింక్యా రహానే తొలిసారి భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో ఇతడు భారత జట్టుకు 50 ఓవర్ల ఫార్మాట్‌లో 23వ కెప్టెన్ అయ్యాడు.

భారత జట్టు: అజింక్య రహానె (కెప్టెన్), మురళీ విజయ్, అంబటి రాయుడు (వికెట్ కీపర్), మనోజ్ తివారీ, కేదార్ జాదవ్ (వికెట్ కీపర్), రాబిన్ ఉతప్ప (వికెట్కీపర్), మనీష్ పాండే, హర్భజన్ సింగ్, అక్షర్ పటేల్, ధావల్ కులకర్ణి, స్టువర్ట్ బిన్నీ, భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మ సందీప్ శర్మ.

జింబాబ్వే: ఎల్టన్ చిగుంబర (కెప్టెన్), రెగిస్ చకబ్వా(వికెట్ కీపర్), సీన్ విలియమ్స్, చాము చిభాభా, గ్రేమ్ క్రెమెర్ నెవిల్లె మడ్జివా, హామిల్టన్ మస్కదా, రిచ్మండ్ ముతుంబామి(వికెట్ కీపర్), తినషి పన్యగార, వుషి సిబండ, సికందర్ రజా, డోనాల్డ్ తిరిపనో, ప్రోస్పర్ ఉత్సెయా, బ్రియాన్ విటోరి, మాల్కం వాలర్.

Story first published:  Friday, July 10, 2015, 12:44 [IST]
English summary
Zimbabwe captain Elton Chigumbura won the toss and elected to bowl first against India in the 1st of the 3 ODIs here at Harare Sports Club on Friday.
మీ వ్యాఖ్య రాయండి