Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

23వ వన్డే కెప్టెన్‌గా రహానే: అంతకముందు ఎవరెవరు?

Posted by:
Published: Friday, July 10, 2015, 13:03 [IST]

హరారే: జింబాబ్వే పర్యటనలో భాగంగా తొలి వన్డే ప్రారంభమైంది. దీంతో అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో భారత్‌కు 23వ కెప్టెన్‌గా అజ్యంకె రహానే తన మొట్ట మొదటి మ్యాచ్‌కి కెప్టెన్సీ చేస్తున్నాడు. జింబాబ్వే పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, రెండు ట్వంటీ20లు ఆడుతున్న సంగతి తెలిసిందే.

హరారే స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్ రహానే టాస్ ఓడిపోయాడు. దీంతో జింబాబ్వే కెప్టెన్ ఎల్టన్ చిగుంబుర భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ముంబైకి చెందిన 27ఏళ్ల అజ్యంకె రహానే శుక్రవారంతో భారత్ ఎలైట్ కెప్టెన్ల జాబితాలో చేరాడు.

1974లో భారత వన్డే జట్టుకు అజిత్ వాడేకర్ ప్రాతినిథ్యం వహించాడు. భారత్‌ జట్టు తరుపున అత్యధిక వన్డే మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించిన రికార్డు మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉంది. కెప్టెన్‌గా ధోని 181 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు.

Ajinkya Rahane becomes India's 23rd ODI captain; Here is the full list

అంతేకాదు 101 విజయాలను భారత్ జట్టుకు అందించాడు. జింబాబ్వే పర్యటనలో సీనియర్లు ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సురేష్ రైనాలకు విశ్రాంతి నిచ్చిన బీసీసీఐ రహానేను కెప్టెన్‌గా నియమిస్తూ యువ ఆటగాళ్లను పంపింది. జట్టులో భజ్జీ ఒక్కడే సీనియర్ ఆటగాడు.

భారత జట్టు వన్డే కెప్టెన్లు(జులై 10, 2015 వరకు):

1. Ajit Wadekar - 1974 (2 matches)
2. Srinivas Venkataraghavan - 1975 to 79 (7)
3. Bishan Singh Bedi - 1976 to 78 (4)
4. Sunil Gavaskar - 1980 to 85 (37)
5. GR Viswanath - 1981 (1)
6. Kapil Dev - 1982 to 87 (74)
7. Syed Kirmani - 1983 (1)
8. Mohinder Amarnath - 1984 (1)
9. Ravi Shastri - 1987 to 91 (11)
10. Dilip Vengsarkar - 1987 to 89 (18)
11. Kris Srikkanth - 1989 (13)
12. Mohammad Azharuddin - 1990 to 99 (174)
13. Sachin Tendulkar - 1996 to 2000 (73)
14. Ajay Jadeja - 1998 to 99 (13)
15. Sourav Ganguly - 1999 to 2005 (146)
16. Rahul Dravid - 2000 to 07 (79)
17. Anil Kumble - 2002 (1)
18. Virender Sehwag - 2003 to 12 (12)
19. MS Dhoni - 2007 to 15 (181)
20. Suresh Raina - 2010 to 14 (12)
21. Gautam Gambhir - 2010 to 11 (6)
22. Virat Kohli - 2013 to 14 (17)
23. Ajinkya Rahane - 2015 (1)

English summary
Ajinkya Rahane today became India's 23rd One Day International captain when he led the side against Zimbabwe in the opening match of the 3-game series.
మీ వ్యాఖ్య రాయండి