Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

జింబాబ్వే టూర్లో అంబటిరాయుడు ఔట్, సంజుకి ఛాన్స్

Posted by:
Published: Monday, July 13, 2015, 12:48 [IST]

ముంబై: గాయం కారణంగా భారత జట్టు మిడిల్ ఆర్డర్ ఆటగాడు అంబటి రాయుడు జింబాబ్వే పర్యటనలో తప్పుకున్నాడు. రాయుడు స్థానంలో సంజు శ్యాంసన్‌కు పిలుపు వచ్చింది.

జింబాబ్వే పర్యటనలో అంబటి రాయుడు అదరగొట్టిన విషయం తెలిసిందే. రెండు వన్డేల్లోను ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. తొలి వన్డేలో 124 నాటౌట్‌గా నిలిచాడు. ఆదివారం నాడు రెండో వన్డేలో 41 పరుగులు చేశాడు. రెండు వన్డేల్లోను భారత్ గెలిచింది. 2-0తో ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకుంది.

 Ambati Rayudu out of Zimbabwe tour; Sanju Samson called up

మూడో వన్డే మంగళవారం నాడు జరగనుంది. ఆ తర్వాత రెండు టి 20లు ఆడనుంది. రెండో వన్డే ఆడుతున్న సమయంలో అతని కుడి తొడ కండరాలు పట్టుకున్నాయి. అతనికి రెండు నుండి మూడు వారాల విశ్రాంతి అవసరమని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో మిగతా జింబాబ్వే పర్యటనకు అంబటి రాయుడు దూరంగా ఉండనున్నాడు. అతని స్థానంలో సంజు వస్తున్నాడని బిసిసిఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ చెప్పాడు. 20 ఏళ్ల సంజు ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు.

English summary
India's middle-order batsman Ambati Rayudu has been ruled out of the remainder of the Zimbabwe tour due to an injury. Uncappced Sanju Samson has been called up.
మీ వ్యాఖ్య రాయండి