Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

స్పాట్ ఫిక్సింగ్: హికెన్ షాపై సస్పెన్షన్ వేటు

Published: Monday, July 13, 2015, 16:45 [IST]

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అవినీతికి పాల్పడ్డాడంటూ ముంబై రంజీ క్రికెటర్ హికెన్ షాపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) సస్పెన్షన్ వేటు వేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్-8లో రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ప్రవీణ్ తాంబేను ప్రలోభ పెట్టేందుకు షా ప్రయత్నించాడని నిర్ధారణ కావడంతో బిసిసిఐ తాజా నిర్ణయం తీసుకుంది.

Mumbai cricket in shock after Hiken Shah's suspension

షా తనను కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ ‘ఆఫర్' చేసిన విషయాన్ని తాంబే నిజాయితీ తన ఫ్రాంఛైజీకి తెలియజేశాడు. దీంతో ఈ అంశంపై బిసిసిఐ సీరియస్‌గా దృష్టి పెట్టింది. 30ఏళ్ల హికెన్ షా ప్రస్తుతం ఏ ఫ్రాంఛైజీ తరపున ఆడటం లేదు.

ముంబై తరపున 37 ఫస్ట్ మ్యాచులు ఆడిన ఈ క్రికెటర్ 2160 పరుగులు చేశాడు. ఐపిఎల్ ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాంటీ కరప్షన్ కోడ్‌ను షా ఉల్లంఘించినట్లు తేలిందని బిసిసిఐ వర్గాలు వెల్లడించాయి. తక్షణమే షాపై సస్పెన్షన్ అమల్లోకి వస్తుందని బిసిసిఐ ఓ ప్రకటనలో పేర్కొంది.

English summary
There was shock and disbelief in Mumbai cricketing circle after BCCI suspended batsman Hiken Shah for making a "corrupt approach" to a fellow player during the last IPL.
మీ వ్యాఖ్య రాయండి