Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

చెన్నై, రాజస్థాన్‌పై 2ఏళ్ల నిషేధం, శిల్పాశెట్టి భర్తకు షాక్

Posted by:
Published: Tuesday, July 14, 2015, 14:08 [IST]

న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు షాక్ తగిలింది. ఆ రెండు జట్ల పైన నిషేధం పడింది. ఈ రెండు జట్లను ఐపీఎల్ నుంచి రెండు సంవత్సరాల పాటు నిషేధం విధిస్తున్నట్లు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జస్టిస్ లోథా కమిటీ వెల్లడించింది.

ఇక బిసిసిఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మీయప్పన్‌ను క్రికెట్ నుంచి, దాని సంబంధిత కార్యకలాపాల నుంచి జీవితకాలం నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, రాజస్థాన్ జట్టు సహ యజమాని రాజ్ కుంద్రా పైన కూడా నిషేధం విధించింది. వారు ఐపిఎల్ ప్రతిష్టను దిగజార్చారని పేర్కొంది.

 Chennai Super Kings, Rajasthan Royals suspended for 2 years from

కాగా, 2013 ఐపీఎల్‌ స్పాట్ ఫిక్సింగ్‌ కుంభకోణంపై నేడు తీర్పు వచ్చింది. జస్టిస్‌ లోథా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ ఈ కేసులో నేడు తుది తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు స్పాట్‌ ఫిక్సింగ్‌, బెట్టింగ్‌ కుంభకోణంపై ఏడాదిన్నర పాటు విచారణ జరిపిన ముద్గల్‌ కమిటీ.. ఈ ఏడాది జనవరిలో నివేదిక సమర్పించింది.

ఆ నివేదిక ఆదారంగా దోషులకు శిక్షలు ఖరారు చేయడం, ఫ్రాంఛైజీల చర్యలు చేపట్టడం కోసం సుప్రీం కోర్టు లోథా కమిటీని నియమించింది. కుంభకోణానికి సంబంధించి అప్పటి ఐపీఎల్‌ సీఓఓ సుందర్‌ రామన్‌ను పాత్రను పరిశీలించి అతడికీ లోథా కమిటీ శిక్ష విధించింది.

English summary
In a massive blow to the Indian Premier League (IPL), Chennai Super Kings (CSK) and Rajasthan Royals (RR) teams were on Tuesday (July 14) suspended from the league for a period of 2 years.
మీ వ్యాఖ్య రాయండి