Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ముంబైకి షాక్: అలా చేయలేదన్న హికెన్ షా

Posted by:
Published: Tuesday, July 14, 2015, 11:46 [IST]

ముంబై: ఫిక్సింగ్ చేద్దామంటూ ఓ ఆటగాడు తనను సంప్రదించాడని ఐపీఎల్ 8 ఆరంభంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు బిసిసికి సమాచారం ఇవ్వగా.. ఆ సమాచారం ఇచ్చింది ప్రవీణ్ తంబే అని, ఫిక్సింగ్ చేద్దామని చెప్పింది హికెన్ షా అని తేలిన విషయం తెలిసిందే. అతనిని బిసిసిఐ సస్పెండ్ చేసింది.

దీనిపై హికెన్ షా స్పందించారు. అవినీతి ఆరోపణలతో బిసిసిఐ తనను సస్పెండ్ చేయడం తనకు దిగ్భ్రాంతి కలిగించిందని చెప్పాడు. కోచింగ్‌కు సంబంధించే తాను ప్రవీణ్ తంబేను కలిశానని చెప్పాడు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని చెప్పాడు.

I'm innocent, will fight to prove it - Hiken Shah

తాను ఇప్పటికే తన వాదనను బిసిసిఐకి వినిపించానని చెప్పాడు. ఇక చెప్పడానికి ఏమీ లేదన్నారు. కాగా, హికెన్‌ అవినీతికి ప్రయత్నించినట్లు తమ విచారణలో తేలిందని బీసీసీఐ అంతకుముందు చెప్పింది. హికెన్‌ షాను తక్షణమే సస్పెండ్‌ చేస్తున్నామని తెలిపింది. హికెన్ షా విషయం తెలిసి ముంబై క్రికెట్ షాకైంది.

English summary
I'm innocent, will fight to prove it - Hiken Shah
మీ వ్యాఖ్య రాయండి