Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఆదరణేది?: సీఎల్టీ20ని రద్దు చేసిన బిసిసిఐ

Published: Wednesday, July 15, 2015, 12:57 [IST]

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత, అంతగా ఆకట్టుకుంటున్న ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20(సీఎల్టీ20) టోర్నమెంటు అధికారికంగా రద్దయింది. ఎప్పట్నుంచో రద్దవుతుందని ఊహాగానాలు వస్తున్నప్పటికీ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) బుధవారం సీఎల్టీ20ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

‘ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20(సీఎల్టీ20) బుధవారం రద్దు చేయడం చేయబడిందని సీఎల్టీ20 గవర్నింగ్ కౌన్సిల్ ధృవీకరించింది. అంతేగాక, ఈ రద్దు తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది' అని ఇండియన్ క్రికెట్ బోర్డ్ మీడియా అడ్వైజర్ ఒకరు బుధవారం మీడియాకు తెలిపారు.

‘సీఎల్టీ20 గవర్నింగ్ కౌన్సిల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న బిసిసిఐ, క్రికెట్ సౌతాఫ్రికా(సిఎస్ఏ), క్రికెట్ ఆస్ట్రేలియా(సిఏ)లు సీఎల్టీ రద్దును ఏకగ్రీవంగా ఆమోదించాయి. దీంతో సెప్టెంబర్, అక్టోబర్‌లో జరగాల్సిన సీఎల్టీ20 టోర్నీకి ప్రణాళికలు వేయాల్సిన అవసరం లేకుండా పోయింది' అని అడ్వైజర్ చెప్పారు.

Champions League T20 scrapped with immediate effect

సిఎల్టీ20ని 2009లో సిఏ, సిఎస్ఏలతో కలిసి బిసిసిఐ ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రజాదరణ కోల్పోతున్నందున ఈ టోర్నీని రద్దు చేయాలని సీఎల్టీ20 గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించింది.

బిసిసిఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘ఇండియాలో నిర్వహిస్తున్న ఐపిఎల్, ఆస్ట్రేలియాలో నిర్వహిస్తున్న బిగ్ బాష్ లీగ్, దక్షిణాఫ్రికాలో నిర్వహిస్తున్న స్లామ్ టీ20ల నుంచి సీఎల్టీ20కి పోటీ ఎదురవుతోంది. ఆటగాళ్లకు మంచి అవకాశంగా ఉన్న సీఎల్టీ20కి అభిమానుల నుంచి తగిన ఆదరణ లభించడం లేదు' అని అన్నారు.

తమ వాణిజ్య భాగస్వాములందర్నీ సంప్రదించిన తర్వాతే సీఎల్టీ20 రద్దుపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రద్దుకు సంబంధించిన ఇతర వ్యవహారాలు తర్వలోనే ముగించడం జరుగుతుందని తెలిపారు.

English summary
It is official now. The Champions League Twenty20 (CLT20) tournament has been scrapped with immediate effect. The confirmation of this came from the Board of Control for Cricket in India (BCCI) today.
మీ వ్యాఖ్య రాయండి