Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

చెన్నై, రాజస్థాన్ ప్లేయర్ల పరిస్థితేంటి? శ్రీనికి ఝలకేనా

Posted by:
Published: Wednesday, July 15, 2015, 11:41 [IST]

న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌కు షాక్ తగలడంతో... ఇప్పుడు ఆ జట్ల ఆటగాళ్ల పరిస్థితి ఏమిటనే ప్రశ్న పలువురిలో తలెత్తుతోంది. చెన్నై, రాజస్థాన్‌లు వచ్చే రెండేళ్లు ఐపీఎల్లో పాల్గొనకుండా శిక్ష విధించారు.

గురునాథ్ తప్పు చేశాడని తెలిసినా ఇండియా సిమెంట్స్ అతడిపైన చర్యల చేపట్టలేదని తేల్చారు. అతడిపైన చర్య చేపట్టే ఉద్దేశ్యం కూడా వారికి ఉన్నట్లుగా కనిపించలేదని తేల్చారు. గురునాథ్ అరెస్టు తర్వాత అతడి పైన బిసిసిఐ నిషేధం విధించినా, ఇండియా సిమెంట్స్ మాత్రం చర్యలు తీసుకోలేదని చెప్పారు.

కాగా, వచ్చే రెండేళ్లకు చెన్నై, రాజస్థాన్‌ ఫ్రాంఛైజీ హక్కుల కోసం బీసీసీఐ ప్రత్యేకంగా వేలం నిర్వహించవచ్చు. ప్రస్తుతం చెన్నై, రాజస్థాన్‌ల ఆటగాళ్లనే ఆ ఫ్రాంఛైజీలకు బదలాయించే అవకాశముంది. ఆటగాళ్లతో ప్రస్తుత ఒప్పందాలనే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.

IPL verdict: Lodha panel's punishment is exemplary, but bigger job is reforming BCCI

అలాకాకపోయినా ఈ ఆటగాళ్లను ఏటా జరిగే వేలంలోకి తెచ్చి అందులోంచి ఫ్రాంఛైజీలు జట్లను తయారు చేసుకునే అవకాశం కల్పించవచ్చు. లోధా కమిటీ యాజమాన్యాల మీదే నిషేధం విధించిన నేపథ్యంలో ప్రస్తుత ఫ్రాంఛైజీల యాజమాన్యాలే వేరే సంస్థలకు వచ్చే రెండేళ్ల వరకు జట్లను అమ్ముకునే అవకాశాలున్నాయి.

ప్రస్తుతమున్న జట్ల పేర్లతో, ఆటగాళ్లతోనే కొత్త యాజమాన్యాలు ఐపీఎల్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, న్యాయపరమైన చిక్కులు రావొచ్చు. లీగ్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వల్ల బహిష్కరణకు గురైన పుణె, కోచి ఫ్రాంఛైజీలను తిరిగి ఐపీఎల్‌లోకి తీసుకురావచ్చు.

ఇదంతా కాకుండా, తర్వాతి రెండు ఐపీఎల్‌ సీజన్లను ఆరు జట్లతోనే నిర్వహించే అవకాశాలనూ కొట్టి పారేయలేం. ఆ జట్ల ఆటగాళ్లను ఏటా జరిగే వేలంలోకి తీసుకురావచ్చు. పేరున్న కొందరు ఆటగాళ్లను మాత్రం జట్లు ఎంచుకోవచ్చు. గురునాథ్.. బెట్టింగ్‌కు పాల్పడటంతో.. అతని పైన జీవిత కాల నిషేధం విధించారు.

మరోవైపు, రాజస్థాన్ రాయల్స్ పైనా రెండేళ్ల నిషేధం విధించారు. బెట్టింగులో రాజ్ కుంద్రా చర్యలు వ్యక్తిగతమని రాజస్థాన్ చెప్పింది. కానీ అది సరికాదని చెప్పారు. ఫ్రాంచైజీలో తన వాటాను అమ్మేసినా అప్పటికే ఆలస్యమైందని చెప్పారు. కుంద్రా పైన చర్యలు తీసుకోలేదు.

ఇదిలా ఉండగా, శ్రీనివాసన్‌ను సెప్టెంబరు నెలలో జరిగే ఐసీసీ సమావేశానికి బిసిసిఐ ప్రతినిధిగా పంపించాలా వద్దా అని బోర్డు పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది జూన్లో పదవీకాలం ముగియడానికి ముందే అతడిని సాగనంపే అవకాశాలను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. కాగా, 19న ఐపీఎల్ పాలక మండలి కీలక సమావేశం కానుంది.

ఇది ఐపీఎల్‌కు చేదువార్త అని, ఐతే ఏవో ఒకటి రెండు తప్పులు జరిగినంత మాత్రాన మొత్తం టోర్నీనే నిందించకూడదని, ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్‌కు గుర్తింపు వచ్చిందని, ఆటతో సంబంధం లేని ఇలాంటి విషయాలు టోర్నీపై పెద్దగా ప్రభావం చూపవని, ఐపీఎల్ గాడిన పడుతుందని గంగూలీ అన్నారు.

English summary
IPL verdict: Lodha panel's punishment is exemplary, but bigger job is reforming BCCI
మీ వ్యాఖ్య రాయండి