Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఐపీఎల్: చెన్నై సస్పెన్షన్ రోజున, స్కూల్లో కెప్టెన్ ధోని

Posted by:
Published: Wednesday, July 15, 2015, 12:43 [IST]

బొకారో: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్ధాన్ రాయల్స్ జట్లపై రెండేళ్ల పాటు నిషేధం విధిస్తూ జస్టిస్ రాజేంద్ర ముల్ లోథా కమిటీ మంగళవారం సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ఓ స్కూల్ కార్యక్రమంలో పాల్గొన్నాడు.

జస్టిస్ లోథా తీర్పుతో యావత్ భారతీయ క్రికెట్ నివ్వెరపోతే, కెప్టెన్ కూల్ మాత్రం బొకారోలోని ఓ స్కూల్ విద్యార్ధులకు తన క్రికెట్ పరిజ్ఞానాన్ని షేర్ చేస్తూ బిజీగా గడిపాడు. మంగళవారం కెప్టెన్ ధోని బొకారో స్టీల్ సీటీలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్) సందర్శించాడు.

స్ధానిక మీడియా కథనం ప్రకారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లోని '100% అటెండెన్స్ అవార్డు'ల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధోని హాజరైనట్లు తెలుస్తోంది. విద్యార్ధులతో కలిసి ధోని క్లాస్ రూమ్‌లో కూర్చున్న ఫోటోను మీరు చూడొచ్చు.

On the day of CSK's suspension, captain MS Dhoni 'attended' school

స్కూల్లో ధోని ఉండగానే జస్టిస్ లోథా కమిటీ చెన్నై, రాజస్ధాన్ జట్లపై రెండేళ్ల పాటు నిషేధం విధిస్తూ తీర్పుని వెలువరించింది. లోథా కమిటీ తీర్పు నేపథ్యంలో ఐపీఎల్ పాలకమండలి అత్యవసర సమైవేశం ముంబైలో ఈ నెల 19న జరగనుందని ఓ సభ్యుడు తెలిపారు.

రాజీవ్ శుక్లా నేతృత్వంలోని
పాలకమండలిలో బోర్డు ఆఫీస్ బేరర్లతో పాటు మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, సౌరభ్ గంగూలీ కూడా ఉన్నారు. మండలి కన్వీనర్‌గా అనురాగ్ ఠాకూర్ వ్యవహారిస్తున్నారు. ఆదివారం జరిగే ఈ సమావేశంలో ప్రాంఛైజీల నిషేధంపైనే ప్రధానంగా చర్చ జరగే అవకాశం ఉంది.

English summary
On a day when Justice RM Lodha Committee suspended Chennai Super Kings (CSK) for 2 years, the team's captain MS Dhoni was busy attending school and sharing his cricket knowledge with the students.
మీ వ్యాఖ్య రాయండి